"స్వర్లోకవాసివని తెలియజెప్పే తేజస్సుతో చిత్రమైన
సౌందర్యంతో అలరారే వనితా, ఇంతకీ నీవెవరవు?
నీ పాదాలకి ఆ రెక్కలేమిటి? ఎందుకంత తొందర?"
"నా రహస్యాలు ఎవరూ దొంగిలించలేరని పేరుపడ్ద
అవకాశమనే వనితను నేనే. ఈ తొందర ఎందుకంటావా?
నా పాదాల క్రింద చక్రాలున్నాయి, అందుకు.
"అవి పక్షుల వేగంకన్నా మిన్నగా కదుల్తాయి
అందుకనే దీటుగా, నా పాదాలకి రెక్కలున్నాయి,
రహస్యంగా అనుసరించి ఆచూకీ తీసేవారి కనుగప్పడానికి.
"దానికి తగ్గట్టుగానే నా జుత్తు ముందుకు వేలాడదీసి
ముఖాన్ని కనుమరుగుచేసేలా గుండెమీదకి కప్పుకుంటాను
నే నక్కడున్నట్టుగాని, నా పేరుగాని ఎవరికీ తెలియకుందికి.
"అత్యాశాపరులు నన్నుపట్టుకుని వ్రేలాడకుండా, చెంతనుండి
పోతున్నపుడు నా వెనుక గడ్డిపరకను సైతం విడువను;
దగ్గరకు వస్తూనే, వెనుదిరిగి పిలుపుకి అందకుండాపోతాను."
"ఇంతకీ, నీ ప్రక్కనే ఉన్న ఆ ఆకృతి ఎవరో చెప్పు?"
"పశ్చాత్తాపం. ఒకటి గుర్తుంచుకో, ఎవరైతే నన్ను నెమ్మది నెమ్మదిగా
వెళ్ళిపోనిస్తారో, వా రామెను అర్థాంగిగా స్వీకరించక తప్పదు.
"నువ్వు ఇప్పటికే నాతో మాటలాడుతూ సమయం వృధాచేశావు,
ఏవో ఆలోచనలూ, వృధాగా నవోన్మేష ప్రణాళికలు రచిస్తూ,
మూర్ఖుడా, నువ్వు చూడనూ లేదు, గ్రహించనూ లేదు
నీ చేతిసందుల్లోంచి నేనెంత వేగంగా జారిపోయానో"
.
నికొలొ మెకియావెలీ
(3rd May 1469 - 21st June 1527)
ఇటాలియన్ రచయిత, రాయబారి, తత్త్వవేత్త
అనువాదం: జేమ్స్ ఎల్రోయ్ ఫ్లెకర్
Portrait_of_Niccolò_Machiavelli_by_Santi_di_Tito
Courtesy: Wikipedia
OPPORTUNITY
.
“But who art thou, with curious
beauty graced
O woman, stamped with some bright
heavenly seal?
Why go thy feet on wings, and in such
haste?”
“I am that maid whose secret few may
steal,
Called Opportunity, I hasten by
Because my feet are treading on a
wheel,
“Being more swift to run than birds
to fly.
And
rightly on my feet my wings I wear,
To blond the sight of those who track
and spy;
“Rightly in front I hold my scattered
hair
To veil my face, and down my breast
to fall,
Lest men should know my name when I
am there;
“And leave behind my back no wisp at
all
For eager folk to clutch, what time I
glide
So near, and turn, and pass beyond
recall.”
“Tell me; who is that Figure at thy
side?”
“Penitence. Mark this well that by
degrees
Who lets me go must keep her for his
bride.
“And thou hast spent much time in
talk with me
Busied with thoughts and fancies
vainly grand,
Nor hast remarked, O fool, neither
dost see
How lightly I have fled beneath thy
hand.”
.
(Tr: James Elroy Flecker)
Niccolo Machiavelli
1469-1527
Italian Poet,
https://archive.org/details/anthologyofworld0000vand/page/578/mode/1up