Monday, June 29, 2020

The Expat... Vinnakota Ravisankar, Telugu Poet, India


 


 

It was long since the umbilical was snapped.

Decades passed since the borders were crossed.

Yet, the yearning for the motherland

Has not ceased a whit.

 

The host country has provided everything.

It taught necessary skills

to gather the fruits of life.

But, the land of early faltering steps

Remains in memory for ever.

 

Not only this soil,

Even the atmosphere here

looks crass and unfamiliar

The Sun and the Moon rising everyday

Seem spent, used up and secondhand.

 

We go to places

Fly like dreams taking to wings.

But whenever the eyelids close in a nap

The face of a childhood pal

Greets us in our dreams.

 

Someday, for sure

I take rest under this soil.

But even in that eternal sleep

The tangs of my native soil

Shall haunt overwhelming me.

.

Vinnakota Ravisankar

Telugu Poet

 A product of REC Warangal, Telangana State, India, Sri Ravisankar works for Dominion Energy and lives in Columbia, South Carolina, US.

A prolific writer and a poet of fine sensibilities, Sri Ravisankar has to his credit three poetry collections 'కుండీలో మర్రిచెట్టు' (The Bonsai Bunyan), 'వేసవి వాన' (The Summer Rain),  and 'రెండో పాత్ర' (The Other Cap); and a Collection of literary essays 'కవిత్వంలో నేను' (The 'I' in Poetry)      

  

 

 

 ప్రవాసి   

.

బొడ్డుతెగి చాలా కాలమయింది

ఒడ్డు మారికూడా దశాబ్దాలు దాటింది

అయినా అమ్మనేలమీద బెంగ మాత్రం

అణువంతైనా తగ్గదు.     

 

ఆదరించిన నేలే అన్నీ ఇచ్చింది

బ్రతుకుఫలాలు అందుకోవటానికి

పరుగెత్తటం నెర్పింది

కాని, తప్పటడుగులు వేసిన నేలే

ఎప్పటికీ తలపుల్లో నిలుస్తుంది.

 

ఈ నేలే కాదు

ఇక్కడి ఆకాశం కూడా

అపరిచితంగా తోస్తుంది

ఉదయించించే సూర్యచంద్రులు

వాడిన వస్తువుల్లా కనిపిస్తారు.

 

ఎక్కడికో వెళతాము

రెక్కలొచ్చిన కలలా ఎగురుతాము

కాని, కన్నులు మూసుకున్నప్పుడు

చిన్నప్పటి నేస్తం ముఖమే

కలలో పలకరిస్తుంది.

 

ఏదో ఒకనాటికి

నేనూ ఈ నేల కిందే నిదురిస్తాను

అనంతశయనంలో  కూడా బహుశా

అక్కడి వాసనలే

విడవకుండా నన్ను వెంటాడతాయి.

.

 విన్నకోట రవిశంకర్

తెలుగు కవి

(తానా జ్ఞాపిక 2013)

 


No comments:

Post a Comment

The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...