ఒంటరిగా నిలబడ్డ ఈ కొండ అంటే నా కెంతో ఇష్టం,
చూపుల అవధి దాటిన దిజ్ఞ్మండలాన్ని కనిపించనీయకుండా
నా దృష్టిని నిరోధిస్తున్న ఈ కంచె అన్నా నాకిష్టమే.
కానీ, ఇక్కడ హాయిగా కూచుని ఆలోచనలలో మైమరచినపుడు
నా ఆలోచనలు ఎక్కడో సుదూరతీరాలకు విస్తరించిన రోదసినీ
అద్భుతమైన నీరవతనీ, దివ్యమైన శాంతినీ గ్రహిస్తాయి;
నాకు ఒక్కసారి భయమేస్తుంది కూడా; కానీ, వెంటనే ప్రక్కనే
ఆకుల దొంతరలలో కదులుతున్న గాలి చేసే మర్మరధ్వనులు విని
స్పష్టమైన చైతన్యవంతపు వర్తమానాన్నీ, నిర్జీవమైన గతాన్నీ
ఆ అనంత నీరవతలోని ప్రశాంతతతో, శబ్దాలతో సరి పోల్చుకుని
మనసులోనే ఆ అనంత తత్త్వాన్ని ఆలింగనం చేసుకుంటాను.
ఆ మహత్వ అపారతలో నా ఆత్మ తలమునకలైపోతుంది.
ఆ పారావారములో పడవమునక ఎంతో మధురంగా ఉంటుంది.
.
(అనువాదం: లోర్నా ద లుక్సి)
జియకోమో లెపార్డీ,
(29 June 1798 – 14 June 1837)
ఇటాలియన్ కవి
.
.
L’Infinito
.
I
always loved this solitary hill,
This
hedge as well, which takes so large a share
Of
the far-flung horizon from my view;
But
seated here, in contemplation lost,
My
thought discovers vaster space beyond
Supernal
silence and unfathomed peace;
Almost
I am afraid; then, since I hear
The
murmur of the wind among the leaves,
I
match that infinite calm unto this sound
And
with my mind embrace eternity,
The
vivid, speaking present and dead past;
In
such immensity my spirit drowns,
And
sweet to me is shipwreck in this sea.
.
(Lorna
De’ Luccchi)
Giacomo
leopardi
(29
June 1798 – 14 June 1837)
Italian
Poet
https://archive.org/details/anthologyofworld0000vand/page/610/mode/1up
No comments:
Post a Comment