నా జీవితం నీ జీవితం నుండి వేరుపడి, అయినా
జీవిత మలిసంధ్య మసక వెలుతురుల వరకూ
కొనసాగమని విధి రాసి పెట్టి ఉంటే,
కళతప్పిన ఆ కన్నులను బహుశా నేను చూస్తాను;
నీ నుదుటపై అందంగా వాలే బంగారు ముంగురులు
కొంత వన్నె తగ్గి వెండిజలతారులై కనిపిస్తాయి,
అక్కడ ఇపుడు సుందరంగా అలంకరించిన పూమాలల బదులు
గతించిన ఎన్నో వసంతాలు జాడలు పరుచుకుంటాయి.
అపుడు నేను సాహసించి నీ చెవులలో ఎప్పటినుండో
అణచుకున్న ప్రేమైక భావనలని గుసగుసలాడినా,
కాలం తాకిడికి ఛిన్నాభిన్నమవగా మిగిలిన ఈ ప్రేమకి
ప్రార్థించడానికి గాని, అర్థించడానికి గాని ఏముంటుంది చెప్పు,
పగిలిన ఈ గుండెకి, కాలం ఎంత గతించినప్పటికీ
నీవు నిరాకరించక కనికరించి విడిచే నిట్టూరుపు తప్ప!
.
(అనువాదం: ఎడ్వర్డ్ ఫిజెరాల్డ్)
పెట్రార్క్
(July 20, 1304 – July 18/19, 1374)
ఇటాలియన్ కవి
.
.
If it be destined
.
If it be destined that my Life, from thine
Divided, yet with thine shall linger on
Till, in the later twilight of Decline,
I may behold those Eyes, their lustre gone;
When the gold tresses that enrich thy brow
Shall all be faded into silver -gray,
From which the wreaths that well bedeck them now
For many a Summer shall have fall’n away;
Then should I dare to whisper in your ears
The pent-up Passion of so long ago,
That Love which hath survived the wreck of years
Hath little else to pray for, or bestow,
That wilt not to the broken heart deny
The boon of one too-late relenting Sigh.
.
(Tr: Edward FitzGerald)
Francesco Petrarca (aka Petrarch)
July 20, 1304 – July 18/19, 1374)
Italian Poet and Scholar
https://archive.org/details/anthologyofworld0000vand/page/560/mode/1up
No comments:
Post a Comment