Wednesday, June 24, 2020

వాగ్వరం... సాది, పెర్షియన్ కవి



నువ్వు ఇంకా మాటలాడగల అద్భుతమైన శక్తి కలిగి ఉన్నపుడే  

నీ ప్రతి ఆలోచననీ దాని మహత్వశక్తి ప్రకాశించేలా ఆవిష్కరించు. 

రేపు, మృత్యువు పంపిన వార్తాహరుడు ఇక్కడికి వచ్చినపుడు

చెప్పదలుచుకున్నది చెప్పేలోపే బలవంతంగా నిన్ను కొనిపోవచ్చు. 

.

సాది

(1220-1291/92)

పెర్షియన్ కవి

అనువాదం: ఎల్. క్రామర్ బింగ్

సాదీ గురించి అనువాదకుని అభిప్రాయం:  

సాదీ ప్రత్యేకత హృదయ సౌకుమార్యమూ, లలితమైన పదవిన్యాసమూ, సున్నితమైన అభిప్రాయ, భావప్రకటన. వాటినతడు ఎంతో సహజంగా, పొదుపైన పదాలలో, సంక్షిప్తంగా, చతురతతో ఉపయోగిస్తాడు. 

.


Image Courtesy: https://www.irangazette.com/en/12/299-history-saadi-shirazi.html

.

Gift of Speech

(From The Gulistan)

 

Now, while thou hast the wondrous power of word,

Let every thought in shining grace appear;

Tomorrow, when Death’s messenger is here,

He will constrain thee to depart unheard.

.

Sa’di 

(Abū-Muhammad Muslih al-Dīn bin Abdallāh Shīrāzī )

1210-  1291or 92)

Persian Poet 

https://archive.org/details/anthologyofworld0000vand/page/144/mode/1up

Tr: L. Cranmer Byng)

About Sa’di: 

Sa’di’s favorite mode is a simplicity and tenderness of heart, a delicacy of feeling and judgement, and that exquisitely natural vein in which he relates his many apologues and parables with a sort of sententious and epigrammatic turn…

James Ross


Tuesday, June 23, 2020

తొందరపడి ప్రపంచాన్ని ప్రేమించవద్దు... ముతామిద్, సెవిల్ మహరాజు, స్పెయిన్




తొందరపడి ప్రపంచాన్ని ప్రేమించవద్దు, ఎందుకంటే

రంగులతో, కసీదా పనితనంతో సింగారించిన ఆ పట్టు వస్త్రం  

నమ్మదగినదీ, నిలకడలేనిదని ఒక్కసారి గమనించండి. 

(నా మాట విను ముతామిద్, నీకు వయసు ఉడిగిపోతోంది)

వయసు వాడికత్తిపదు నెన్నడూ తుప్పుపట్టదని కలగన్న మేము,

మృగతృష్ణలో నీటిఊటల్నీ, ఇసుకలో గులాబీలు ఆశించాం, 

ఈ ప్రపంచప్రహేళికని అర్థం చేసుకున్నా మనుకుని

మట్టిని వస్త్రంగా కప్పుకుని మేధావులుగా భ్రమించాం.  


.

ముతామిద్, సెవిల్* మహరాజు    

(1040-1095)  

అరబ్బీ కవి

అనువాదం: డల్సీ ఎల్. స్మిత్.  



అనువాదకుడు ఈ రాజు గురించి: 

అతని పరాక్రమ సూర్యుడు ఏనాడో అస్తమించి  పశ్చిమదేశాలు అతని వైభవాన్ని మరిచిపోయినా, ఏ రాజ్యంకోసం అతనూ, అతని  సంతానమూ రక్తం ధారపోసిందో ఆ రాజ్యం ఇప్పుడు మరో దేశానికీ, మరో విశ్వాసానికీ  తలవంచి ఊడిగం చేస్తున్నా, యుద్ధాలు విచ్ఛిన్నం చెయ్యలేని, కాలం తుడిచిపెట్టలేని  సౌందర్యాభిలషులైన ఏ జాతిలోనో పై మాటలవల్ల అతని గొప్పదనం నిలిచే ఉంటుంది.  



Woo not the World

.

Woo not the world too rashly, for behold,

Beneath the painted silk and broidering,

It is a faithless and inconstant thing.

(Listen to me, Mu’tamid, growing old.)

And we- that dreamed youth’s blade would never rust,

Hoped wells from the mirage, roses from the sand-

The riddle of the world shall understand

And put on wisdom with the robe of dust.

.

Mu’tamid, King of Seville

(1040- 1095)

Arabic Poet

Tr. : Dulcie L. Smith

Courtesy: https://archive.org/details/anthologyofworld0000vand/page/99/mode/1up


Monday, June 22, 2020

నీటివాలు... ముతామిద్, సెవిల్ మహరాజు, స్పెయిన్

సముద్రం పోతపోసినదది; బలశాలియైన

సూర్యుడు దాని అంచుకి పదునుపెట్టాడు,

స్వచ్ఛమైన తెల్లని ఒరలోంఛి అది ఒక్కసారిగా బయటకి వస్తోంది

మనిషన్నవాడు ఎవడూ ఇప్పటివరకు 

డమాస్కస్ లో అలాంటి కత్తి తయారు చెయ్యలేదు... కాకపోతే

నరకడానికి ఉక్కుతోచేసిన కత్తి నీటికంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది.

.

ముతామిద్, సెవిల్ మహరాజు 

(1040-1095) 

అరబ్బీ కవి

అనువాదం: డల్సీ ఎల్. స్మిత్.


అనువాదకుడు ఈ రాజు గురించి:

అతని పరాక్రమ సూర్యుడు ఏనాడో అస్తమించి పశ్చిమదేశాలు అతని వైభవాన్ని మరిచిపోయినా, ఏ రాజ్యంకోసం అతనూ, అతని సంతానమూ రక్తం ధారపోసిందో ఆ రాజ్యం ఇప్పుడు మరో దేశానికీ, మరో విశ్వాసానికీ తలవంచి ఊడిగం చేస్తున్నా, యుద్ధాలు విచ్ఛిన్నం చెయ్యలేని, కాలం తుడిచిపెట్టలేని సౌందర్యాభిలషులైన ఏ జాతిలోనో పై మాటలవల్ల అతని గొప్పదనం నిలిచే ఉంటుంది. 

                                                            Muhammad Ibn Abbad Al Mutamid

The Fountain
.

The sea hath tempered it; the mighty sun
Polished the blade,
And from the limpid sheath the sword leaps forth;
Man hath not made
A better in Damascus --- though for slaughter
Hath steel somewhat advantage over water.
.
Mu’tamid, King of Seville  
(1040- 1095)
Arabic Poet

For though his sun of power went down so long ago that the west has forgotten the colours of his glory, and though the kingdom for which he gave his blood and his children and the years of life now bows to other rulers, another faith, yet among beauty-loving race he still preserves- by reason of those lines which wars have not shattered nor Time effaced- a gentle eminence.
                                                                                                            
                                                                                                            Dulcie L. Smith
                                                                                                            Translator. 
Poem Courtesy: 

https://archive.org/details/anthologyofworld0000vand/page/98/mode/1up

Here is an interesting story about the life of the King  







Sunday, June 21, 2020

అతిజాగ్రత్త గురించి... ఫ్రాన్సిస్కో ద బర్బెరీనో, ఇటాలియన్ కవి


ఇది చెప్పు, కష్టాలు దరిజేరకూడదని

నీకొడుకుని ఎన్నాళ్ళని కాపలాకాయగలవు?

కాబట్టి మొదట్లోనే జాగ్రత్తపడి

అతను తప్పుడుపనులు చెయ్యకుండా పర్యవేక్షించు.

 

నీ ఇల్లు నువ్వు కాపలా కాయగలవా?

ఒక్క తలుపు చాలు అందులో దూరడానికి. మరేం అక్కరలేదు.

నీ పండ్లతోట గోడలని ఎంతకని కాపలాకాయగలవు?

కాబట్టి, పండ్లు అందరికీ ఉచితంగా వదిలెయ్.

.

(అనువాదం: డాంటే గేబ్రియల్ రోజెట్టి.)

ఫ్రాన్సిస్కో ద బర్బెరీనో

(1264 - 1348)

ఇటాలియన్ కవి

 



                                                     Image Courtesy:

                                                    National Galleries of Scotland

Of Caution

.

Say, wouldst thou guard thy son,

That sorrow he may shun?

Begin at the beginning

And let him keep from sinning.

 

Wouldst thou guard thy house? One door

Make to it, and no more.

Wouldst guard thine orchard-wall?

Be free fruit to all.

.

(Tr: D G Rosetti)

Francesco da Barberino

(1264 – 1348)

Italian Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/511/mode/1up

Saturday, June 20, 2020

మూర్ఖుడు - కపటి... పంచతంత్రము నుండి

జ్ఞానవంతుడై నిజాయితీగా ఉండే
అరుదైనవాళ్ళతో స్నేహాన్ని కోరుకో;
జ్ఞానవంతుడై కపటంగా ఉండే వాళ్ళదగ్గర
పదెరెట్లు జాగ్రత్తతో ప్రవర్తించు.
జ్ఞానంలేని నిజాయితీపరుడిని  
చూసి జాలిపడి, అక్కున చేర్చుకో;
కానీ, మూర్ఖుడూ కపటిని మాత్రం
మొదటి పరిచయంనుండే దూరంగా ఉంచు.
.
పంచతంత్రం నుండి

అనువాదం : ఆర్థర్ W రైడర్.


దీనికి సరిసమానమైనది నేను విశాఖపట్నం  కింగ్ జార్జి హాస్పిటల్, సూపరింటెండెంట్ ఆఫీసు ముఖద్వారం దగ్గర పాలరాతిపలకపై చెక్కి ఉన్నది 1970లో చూశాను: 

One who knows not, and knows not that he knows not is a fool, shun him.

One who knows not, but knows that he knows not is ignorant*, teach him

One who knows, but knows not that he knows is asleep, wake him,

One who knows and knows that he knows is wise, follow him. 
.
Anonymous

(There are alternative versions with student/ simple etc in place of ignorant. I think ignorant is more appropriate.) 

తనకి ఏమీ తెలియక, తెలియదనికూడా తెలియని వాడు మూర్ఖుడు, 
                                                                            వాడిని దూరంగా ఉంచు;

తనకేమీ తెలియకపోయినా, ఏమీ తెలియదని తెలిసినవాడు, అజ్ఞాని, 
                                                                            వాడికి బోధించు;

తనకి అన్ని తెలిసినా, తెలుసునన్న విషయం తెలియని వాడు నిద్రలో ఉన్నాడు, 
                                                                            వాడిని తట్టి లేపు,

తనకి అన్నీ తెలిసి, తెలుసునన్న విషయం కూడా తెలిసిన వాడు జ్ఞాని, 
                                                                            వాడిని అనుసరించు. 



ఇంతకంటే గొప్ప సలహా విద్యార్థులకి ఇవ్వగలిగింది ఇంకేముంటుంది? 







Fool and False  
.
With the shrewd and upright man
Seek friendship rare;
Exercise with shrewd and false
Super heedful care;
Pity for the upright fool
Find within your heart;
If a man be fool and false,
Shun him from the start.
.
Translation:  Arthur W Ryder

https://archive.org/details/anthologyofworld0000vand/page/59/mode/1up


Friday, June 19, 2020

కాలం... భర్తృహరి, సంస్కృత కవి

ఈ సర్వంసహా భుమండలానికి కారణం కాలమే; 

కాలంలో జనించిన ఈ సమస్త జీవరాశులూ  

కడకు ఈ కాలగర్భంలోనే విశ్రమిస్తాయి;  

కాలానికి శతృ-మిత్రత్వాలు లేవు.  



ఈ సృష్ట్యాదినుండీ మనమందరమూ 

ఒక సుదీర్ఘమైన బిడారులో ప్రయాణిస్తున్నాము.

మనగమ్యమేమిటో తెలియదు, తెలిసిందల్లా కాలం 

ముందుండి దారిచూపుతుంది; అందరూ అనుసరించవలసిందే



ఆరుబయట మైదానంలో రేగే సుడిగాలికి మొక్కలన్నీ 

తలవాల్చినట్టు అందరూ అవనతులు కావలసిందే;

కనుక మన ఊపిరుల సమయం గడిచిపోగానే ఒక్కరొకరమూ

తప్పుకుంటాం; చావుపుట్టుకలకు కన్నీరు చిందుట దేనికి?  

.

భర్తృహరి

5 వ శతాబ్దం.

సంస్కృత కవి-రాజు ఉజ్జయిని 

అనువాదం: పాల్ ఎల్మర్ మోర్ 


.

Time

.

Time is the root of all this earth;

These creatures, who from Time had birth,

Within his bosom at the end shall sleep;

Time hath nor enemy nor friend.

 

All we in one long caravan

Are journeying since the world began;

We know not whither, but we know

Time guideth at the front, and all must go.

 

Like as the wind upon the field

Bows every herb, and all must yield,

So we beneath Time’s passing breath

Bow each in turn,- why tears for birth or death?

.

Bhartrihari 

(450 -510 CE)

Sanskrit Poet- King Ujjain - and Philosopher.

Translation:  Paul Elmer More

https://archive.org/details/anthologyofworld0000vand/page/65/mode/1up?q=Bhartrihari


Thursday, June 18, 2020

పేదరికం... పంచతంత్రము నుండి



ఒక నిరుపేద మిత్రుడి సమధిదగ్గరకు పరిగెత్తి,

ఇలా ప్రార్థించాడు "శవ మిత్రమా, లే! 

క్షణకాలంపాటు నా భుజాలమీదనుండి 

ఈ పేదరికపు పెనుభారాన్ని తొలగించు; 

ఈ మధ్య, భారం మోయలేక బాగా అలసిపోతున్నాను.  

నువ్వున్నంత హాయిగా నాకూ ఉండాలనిపిస్తోంది.

మరణించి ఈ బాధతప్పించుకున్న అదృష్టవంతుడివి."  

శవం బదులివ్వలేదు. అతనికిపుడు రూఢి అయింది. 

పేదరికం మోయడం కంటే మరణమే మేలని. 

.


సంస్కృత పంచతంత్రము నుండి


అనువాదం: ఆర్థర్ W రైడర్.



.

Poverty

.

A beggar to the graveyard hied,

And there “Friend corpse, arise,” he cried:

“One moment lift my heavy weight

Of poverty; for I of late

Grow weary, and desire instead

Your comfort; you are good and dead.”

The corpse was silent. He was sure

‘Twas better to be dead than poor.

.

Tr. Arthur W Ryder.

https://archive.org/details/anthologyofworld0000vand/page/59/mode/1up


The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...