Day did not break yet
A wake up song echoes from
the foot of the hill
The city afloat in the
morning mist.
Lest it should sink under
the weight of its dreams
A spinning melody lugs it
back to the bank.
The sky and earth
Are deep asleep on the
horizon.
The houses and trees
Breathing heavy in REM
Before long, all homes will
be abuzz
And the city lights shall
sink in the dazzling waters
I will be watching this
aubade
And dearly wish the dawn to
delay.
The day begins. Letters,
Greetings, instructions,
delegation
The buck shall not stop with
me
Nor anything sinks in.
As night deepens,
And all the letters are out,
from in-box
I recall the morning song
Like I read and reread
The letter of an intimate
friend.
And the vine that hooked to
me
In the wee hours of the day,
Blossoms late in the night.
And I wait through the night
Savoring its scents to find
what it is.
.
V. Chinaveerabhadrudu.
పొద్దుటికి పరిమళించే
పాట
.
ఇంకా తెల్లవారని అయిదుగంటలవేళ
కొండకింద గుడిలోంచి
సుప్రభాతకీర్తన.
పడవలాగా మంచులో తేలుతున్న
పట్టణం
కలల బరువుకి కిందకి
ఒరిగిపోకుండా
తాడు కట్టి ఒడ్డుకి
లాగుతున్న పాట.
అకాశమూ, భూమీ ఒకదానిమీద ఒకటి చేతులు వేసుకుని
ఆదమరిచి నిద్రపోతున్నాయి
ఇళ్ళూ, చెట్లూ గాఢనిద్రలో
బరువుగా ఊపిరి తీస్తున్నాయి.
ఇప్పటికో మరికాసేపటికో
ఇళ్ళు మేల్కొంటాయి
వెలుగునీటిలో విద్యుద్దీపాలు
కుంకిపోతాయి.
బాల్కనీలో నిలబడి
నేనా పాటనే పరికిస్తుంటాను.
తెల్లవారడం మరికొంత
సేపు వాయిదా పడితే
బాగుండనుకుంటాను.
రోజు మొదలవుతుంది, ఉత్తరాలు
పలకరింపులు, పనులు, పురమాయింపులు
ఏ ఒక్క సమాచారమూ నా
దగ్గర ఆగదు
ఏ ఒక్కటీ నాలోకి ఇంకదు.
రాత్రయ్యేటప్పటికి
అన్ని ఉత్తరాలూ, ఫైళ్ళూ
నా ఇన్ బాక్సులోంచి
వెళ్ళిపోయేక
అప్పుడు తలుచుకుంటాను
ఆ పొద్దుటిపాటని-
ఆత్మీయురాలి ఉత్తరం
మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్టు.
ఇంకా తెల్లవారని వేళ
నాలోకి కుసుమించిన
ఆ తీగ
రాత్రయ్యేటప్పటికి
పువ్వు పూస్తుంది.
ఆ పరిమళమేమిటో పోల్చుకోడానికి
.
No comments:
Post a Comment