Friday, July 31, 2020

కలలో తేడా లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి



  

చేతులు బార్లా జాపుకుని

వెచ్చగా ఎండలో ఏదో ఒక మూల  

పొద్దుపోయే దాకా చక్రపటాకీలా 

గిరగిరా తిరిగి గంతులేసుకుంటూ,  

నాలా నల్లగా, చిమ్మ చీకటిపడుతుంటే    

ఏ పేద్ద చెట్టు నీడనో చల్లగా  

జేరబడి సేదదీరాలన్నది

ఎప్పటిదో నా కల 



ముఖం మీద ఎండ కొడుతుంటే, 

చేతులు అడ్డంగా ముఖం మీదకి జాపుకుని, 

పగలల్లా తీరుబాటులేకుండా అటూ ఇటూ పరుగుతీస్తూ  

చివరకి, రోజు గడిచిందిరా దేముడా అనిపించుకుని 

సాయంత్రానికి, నా లా నల్లగా, రాత్రి పరుచుకుంటుంటే  

సన్నని పొడవైన ఏ చెట్టునీడనో 

అలసి, నీరసంగా కూలబడతాను 



లాంగ్స్టన్ హ్యూజ్



February 1, 1901 – May 22, 1967



అమెరికను కవి 








Dream Variations





To fling my arms wide

In some place of the sun,

To whirl and to dance

Till the white day is done.

Then rest at cool evening

Beneath a tall tree

While night comes on gently,

Dark like me-

That is my dream!



To fling my arms wide

In the face of the sun,

Dance! Whirl! Whirl!

Till the quick day is done.

Rest at pale evening...

A tall, slim tree...

Night coming tenderly

Black like me. 


Langston Hughes

February 1, 1901 – May 22, 1967

American Poet 

Wednesday, July 22, 2020

2 poems of Dasarathi Krishnamacharya , Telugu Poet, Indian




  (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987)

Today is Dr. Dasarathi's 95th  Birth Anniversary


My life, a garden that reaches out its hands for few jasmines,

My mind, a babe that pricks out its ears for a sonorous song,

My heart, a lotus that is all eyes for a streak of light

My age, an innocence that carts heels over head for a small tribute

 

I laughed when you laughed, and when

you cried your eyes out, was swept away

to the bourns of the worlds by the tears,

never able to swim through the oceans of grief. 


సీ.     ఒక కొన్ని జాజిపూవులకు కేలుసాచెడి వనము వోలినది జీవనము నాది

        ఒక కొంత గానమ్మునకు వీను నిక్కించు నిసువు బోలినది మానసము నాది

        ఒక చిన్ని వెల్గురేకకు నేత్రపుటినిచ్చు తమ్మివోలినది యంతరము నాది

        ఒక కొద్ది తీపి మాటలకు ఉబ్బి తబ్బిబ్బులయిపోవు చిరుతప్రాయమ్ము నాది

 

        నీవు నవ్విన నవ్వితి, నీవు కంట

        నీరు వెట్టిన ఆ నీటి ధారలందు

        కొట్టుకొనిపోతి లోకాల కొట్ట కొసకు

        తిరిగి రానైతి దుఃఖసాగరము నుండి.

 

No quilts are there to keep warm the new-born baby-bud,

Asleep in the lap of its just-labored mother, being drenched

In rain in the tamarind grove; let me strum on my ‘Fiery Lyre’

Lays of fire to keep the tad cozy, lest it should freeze in the cold.

 

.

 

చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా

లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్

బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా

గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్

 .

Dasarathi Krishnamacharya

(22 July 1925 - 5 Nov 1987) 

Telugu Poet, Indian 


Poems Courtesy: Facebook page of Sri Parimi Sri Ramanath  

https://www.facebook.com/itisivam/posts/1001565506928457?notif_id=1595383570193179&notif_t=close_friend_activity

 


Saturday, July 18, 2020

When it was Dark… Koduri Vijaya Kumar, Telugu, Indian Poet





That night…

When failure streamed down as a tear from lashes,

And, the contused body groaned in seething pain

Into that dark room entered Death taking storm for escort

And said:

 

“Look here, my friend! Your grief is as enduring as this rain

… there is nothing left in life…but grief!

Come! Embrace me!...

It is the balm that soothes your wounds.”

 

Breaking through the wounds, these words came out harshly:

 

“This soil has been bathed with their blood by martyrs!

I am a child of the land where even ploughs were turned to arms.

I am a fighter and love the fighting spirit in man

I can’t disgrace the sacrifices of my immortal lineage.  

 

A rolling of thunder was heard in the distance

And the doors opened all of a sudden.

Lo! There was neither storm… nor Death.

The room was flooded with effulgent radiance .

.

 

Koduri Vijaya Kumar

Telugu, Indian Poet


Koduri Vijaya Kumar


చీకటి గదిలో

.

ఓటమి కంటి చివరి చినుకై జారిన రాత్రి

దేహం గాయాల కూడలిగా మారి అలమటించిన రాత్రి

తలుపులు మూసి వున్న చీకటిగదిలో వర్షాన్ని వెంటేసుకు వొచ్చిన

మృత్యువు యిలా అంది:

 

 

 "... మిత్రుడా... యిటు చూడు! ఎడతెగని ఈ వర్షం నీ దుఃఖం!

... జీవితంలో దుఃఖం తప్ప మరేమీ లేదు.

రా! నన్ను ప్రేమించు...

నా కౌగిలి నీ గాయాలకు లేపనం!!"

 

దేహపు గాయాలను చీల్చుకుని, మాటలు కొన్ని యిలా కర్కశంగా వెలువడినాయి:

 

' వీరుల రక్తంతో తడిసిన మట్టి నా దేశం! నాగళ్ళు సైతం

ఆయుధాలుగా మారిన నేల, నా చిరునామా! మనుషుల

పోరాటాల్ని ప్రేమించే మనిషిని; మృత్యువును ప్రేమించలేను

అమరవీరుల త్యాగాలను అవమానించలేను '


బయటెక్కడో వురిమిన శబ్దం

గది తలుపులు తెరుచుకున్నాయి

వర్షమూ లేదు... మృత్యువూ లేదు

గదినిండా గొప్ప వెలుగు!

.

కోడూరి విజయ కుమార్

వార్త ఆదివారం 16 జూన్ 1997.

 




Thursday, July 16, 2020

గాయపడిన మన్మధుడు... ఎనాక్రియన్, గ్రీకు కవి




ఒకసారి గులాబిదొంతరలలో పరున్న

మన్మధుణ్ణి ఒక తేనెటీగ కుట్టింది.

అంతే, కోపంతో వాళ్ళమ్మదగ్గరకి 

పరిగెత్తి, ఏద్చిగగ్గోలుపెడుతూ ఇలా అన్నాడు:

'అమ్మా! కాపాడే! నీ కొడుకు ప్రాణం పోతోందే!"   



"అరే నా బంగారు తండ్రీ! ఏమయిందమ్మా?"

అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అన్నాడు:

"రెక్కలున్న పామేదో నన్ను కరిచిందే,

జానపదులు దాన్ని తేనెటీగ అంటారే."



దాని కామె పకపకా నవ్వి, ముద్దులతో, 

కేశపాశంతో ముంచెత్తి, కన్నీరు తుడుస్తూ,  

"అయ్యో నాయనా! నవ్వొస్తోందిరా! దీనికే

ఉపద్రవం వచ్చినట్టు ఏడవాలిట్రా?

అలాగయితే నీ బాణాలతో అందర్నీ గాయంచేస్తావే  

వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో చెప్పు మరి? " 

.

(అనువాదం: రాబర్ట్ హెర్రిక్) 

ఎనాక్రియన్

582 - 485 BC

గ్రీకు కవి 

Anacreon
Greek Poet
Image Courtesy: Wikipedia



The wounded Cupid

.

Cupid, as he lay among

Roses, by a bee was stung.

Whereupon in anger flying

To his mother, said, thus crying,

Help! O help! Your boy’s a-dying.

And why, my pretty lad? Said she.

Then blubbering replied he:

A winged snake has bitten me,

Which country people call a bee.

At which she smiled, then with her hairs

And kisses, drying up his tears,

Alas! Said she, my wag, if this

Such a pernicious torment is;

Come, tell me then how great’s the smart

Of those thou woundest with your dart!  

.

(Tr: Robert Herrick) 

Anacreon 

582- 485 BC 

Greek Poet 

Poem Courtesy:


https://archive.org/details/anthologyofworld0000vand/page/263/mode/1up


Tuesday, July 14, 2020

పాతపాట...యెహోష్, యిద్దిష్ కవి




పూదోటవంటి జపానులో ఎక్కడో

మారుమూల ఈ పాట పాడుకునే వారు:


ఒక సామురాయ్ లోహకారుడితో ఇలా అన్నాడు:

"నాకో కరవాలము చేసిపెట్టు 

అది నీటిమీద గాలితరగలా తేలికగా,

గోధుమ చేను కోతలపుడు పాడే 

పాటలా, చాలా సుదీర్ఘంగా,

ఏ పగుళ్ళూ లేక, పాములా చురుకుగా,

ఎటుపడితే అటు వంగుతూ

మెరుపువేగంతో కదలాలి!

పట్టుబట్టంత మెత్తగా, పల్చగా,

సాలెపట్టంతా సన్నగా,

చలీ, బాధంత నిర్దాక్షిణ్యంగా ఉండాలి."



"వీరుడా! చేతిపిడి మీద తమ ఆదేశం?"



"చేతి పిడి మీద, సజ్జనుడా,

ప్రవహిస్తున్న సెలయేటినీ,

ఒక గొర్రెల మందనీ,

పాడుతూ, పాపాయిని నిద్రపుచ్చుతున్న తల్లినీ

నా కోసం చెక్కు, " అన్నాడు.  

.

అనువాదం: మేరీ సైర్కిన్)

యెహోష్

(16th Sept 1872 – 10 Jan 1927)  

యిద్దిష్ కవి, అనువాదకుడు.





An Old Song (Yiddish)

.

In the blossom-land Japan

Somewhere thus an old song ran

Said a warrior to a smith

“Hammer me a sword forthwith.

Make the blade

Light as wind on water laid.

Make it long

As the wheat at harvest song.

Supple, swift

As a snake, without rift,

Full of lightnings, thousand-eyed!

Smooth as silken cloth thin

As the web that spider spin.

And merciless as pain, and cold.”

“On the hilt what shall be told?”

“On the sword’s hilt, my good man,”

Said the warrior of Japan,

“Trace for me

A running lake, a flock of sheep

And one who sings her child to sleep.”

.

(Tr: Marie Syrkin)

Yehoash (Solomon Bloomgarden)  

(16th Sept 1872 – 10 Jan 1927)

Yiddish Poet, translator.

Poem Courtesy: 

https://archive.org/details/anthologyofworld0000vand/page/234/mode/1up



Sunday, July 12, 2020

జీవితమొక కల... పెడ్రో కాల్డెరాన్ బార్కా, స్పానిష్ కవి



మనం జీవించి ఉన్నంత కాలమూ 

జీవితమూ, కలా ఒకటిగా జీవిస్తాము. 

జీవితం నాకు నేర్పిన పాఠం ఇది:

జీవితం ముగిసిపోయే వరకూ మనిషి

తనదైన జీవితాన్ని కలగంటూనే ఉంటాడు 

మహరాజు తనొక మహరాజునని కలగంటాడు

అధికారం, అజమాయిషీ చలాయిస్తూ

మహరాజునని మోసగించుకుంటూ బ్రతుకుతాడు.

అతని గురించి చేసిన పొగడ్తలన్నీ 

గాలిమీద రాతల్లాంటివి, దారిలో కొంత

దుమ్మూ ధూళీ కూడా పోగిచేసుకుంటాయి 

అకస్మాత్తుగా మృత్యువా చివరిశ్వాస లాక్కునే వరకూ.

మృత్యువనే రెండో కలలో, ఎవరికీ

ఏమీ తెలియకుండా సర్వనాశన మైనపుడు  

ఈ సింహాసనంవల్ల ఏమి ప్రయోజనం?  

భాగ్యవంతుడు తన సంపదతో బాటుగా  

దా న్ననుసరించే భయాల్నీ కలగంటాడు;

నిరుపేద తన దైనిక అవసరాల్ని కలగంటాడు,

అతని దుఃఖాలూ, కన్నీళ్ళతోబాటు;

కాలక్రమంలో తన స్థితి మెరుగౌతున్నట్టూ,

తనుకూడా పదిమందికి దానంచేస్తున్నట్టూ,

శత్రువుల్ని తిడుతున్నట్టూ కలగంటాడు.

నేను చూస్తున్న ఈ విశాల ప్రపంచంలో

మనిషి తనెటువంటి వాడైనా, రెండో కంటికి

తెలియకుండా, తన కల తాను కంటూనే ఉంటాడు. 

నేనూ కలగంటూ కలకై ఎదురుచూస్తుంటాను,

నన్నెవరో సంకెలలలో బందించినట్టూ,

ఇప్పుడు నే ననుభవిస్తున్న బాధలన్నీ

గతంలో చేసిన మంచికి పర్యవసానాలని.  

ఇంతకీ, జీవితమంటే ఏమిటి? చరిత్రకెక్కిన ఒక కథా? 

జీవితమంటే ఏమిటి? అవధులులేని ఆవేశమా?

ఉన్నట్టు భ్రమింపజేసే వస్తువుల క్రీనీడ;

దానివల్ల వచ్చే ఎంత గొప్ప మంచైనా, చిన్నమెత్తే, 

అందరికీ జీవితమంతా ఒక కలగా కనిపిస్తుంది,

ఆ మాటకొస్తే, అసలు కలలన్నవే ఒక కల.

.

అనువాదం: ఆర్థర్ సైమండ్స్) 

పెడ్రో కాల్డెరాన్ ది ల బార్కా

(17 January 1600 – 25 May 1681)

స్పానిష్ కవి






From “Life is a Dream”

.

We live, while we see the sun,

Where life and dreams are as one;

And living has taught me this,

Man dreams the life that is his,

Until his living is done.

The king dreams he is king, and he lives

In the deceit of a king,

Commanding and governing;

And all the praise he receives

Is written in wind, and leaves

A little dust on the way

When death ends all with a breath.

Where then is the gain of a throne,

That shall perish and not be known

In the other dream that is death?

Dreams the rich man of riches and fears,

The fears that his riches breed;

The poor man dreams of his need,

And all his sorrows and tears;

Dreams he that prospers with years

Dreams he that feigns and foregoes,

Dreams he that rails on his foes;

And in all the world I see.

Man dreams whatever he be,

And his own dream no man knows.

And I too dream and behold,

I dream and I am bound with chains,

And I dreamed that these present pains

Were fortunate ways of old.

What is life? A tale that is told?

What is life? A frenzy extreme,

A shadow of things that seem;

And the greatest good is but small,

That all life is a dream to all,

And that dreams themselves are a dream.

(Tr: Arthur Symons)

Pedro Calderon de la Barca

Spanish Poet

(17 January 1600 – 25 May 1681)

 https://archive.org/details/anthologyofworld0000vand/page/647/mode/1up


Saturday, July 11, 2020

పచ్చికబయళ్ళలో లార్క్ పక్షి... సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి



Image Courtesy: 
https://www.youtube.com/watch?v=OsMSC3pkoDU 


వానవెలిసిన తర్వాత మిగిలే వెండివెలుగులో

ఇంకా చినుకులు రాలుస్తున్న మెరుగు పచ్చ పొదలమధ్యనుండి 

పచ్చికబయళ్ళలోని లార్క్ పక్షుల కుహూరవాలు వినడానికి 

ఒంటరిగా, మహారాణిలా, ఎంతో ఉత్సాహంతో కాలిబాటపట్టేను.



బ్రతుకన్నా, చావన్నా నాకు భయపడడానికి ఏముంది?

అసలు ఈ మూడూ తెలిసినవారు లోకంలో ఎవరున్నారని:

రాత్రి ముద్దూ, గొంతులో పాట పలుకేటప్పుడు రెక్కతొడిగే ఆనందం, 

ఈ వెండి వెలుగుల ప్రకృతి హేలలో లార్క్ పక్షుల రసధునీ?     

.


సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933) 

అమెరికను కవయిత్రి


Sara Teasdale

Image Courtesy: Wikipedia


Meadow Larks

.

In the silver light after a storm,

Under dripping boughs of bright new green,

I take the low path to hear the meadowlarks

Alone and high-hearted as if I were a queen.



What have I to fear in life or death

Who have known three things: the kiss in the night,

The white flying joy when a song is born,

And meadowlarks whistling in silver light.

.



Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933) 

American Poet

Friday, July 10, 2020

Love in a Hospital... Ismail, Telugu Poet, Indian





It was not yet time for your visit

I was watching the cityscape through the window

earth had stretched its sharp nails of shadows

Tearing open the sky, it swallowed the Sun.

And the Bacilli were multiplying in every corner,

drawing the last ounce of hope from the moans.  


It was time for your visit

suddenly, tubelights-syrenges started injectimg

Light into the veins of ashen city.

At last, windows opened their eyes.

I hear your shoes on the stairs

You enter like a WBC then. 

.

Ismail
 
(26 May 1928 – 25 November 2003)

Telugu Poet 




హాస్పిటల్లో ప్రేమ   

.
నువ్వొచ్చేవేళ కాలేదింకా

గవాక్షంలోంచి చూస్తున్నాను ఊరివంక

నీడల వాడిగోళ్ళని చాచింది ధరణి

నింగి పొట్టని చీల్చి మింగింది రవిని

మూలమూలలా ” బేసిలై “  తోడుకుంటున్నాయి

మూలుగుల్లోని వెలుగుల్నికూడా తోడేస్తున్నాయి.

  
నువొచ్చే వేళైంది

చివాల్న ట్యూబ్లైట్ల ఇంజక్షను మొదలైంది

పట్టణం నరాల్లోకి కాంతులు ప్రవహించాయి

కట్టకడకు కిటికీలు కళ్ళుతెరిచాయి

మెల్లగా మెట్లపై నీ బూట్ల చప్పుడు

తెల్ల జీవకణంలా ప్రవేశిస్తావప్పుడు.

.

ఇస్మాయిల్

(26 May 1928 – 25 November 2003)

తెలుగు కవి 

Monday, July 6, 2020

పేదమహరాజు (సానెట్) .. బార్తలొ మేయో ది సెయింట్ ఏంజెలో, ఇటాలియన్ కవి



(కవి తన పేదరికం గూర్చి హాస్యంగా చెబుతున్నాడు)      

.

దారిద్య్రంలో నేను ఎంత గొప్పవాడినంటే  

ఈ క్షణంలో పారిస్, రోం, పీసా, పాడువా

బైజాంటియం, వెనిస్, ల్యూకా, ఫ్లారెన్స్, ఫర్లీ వంటి 

అన్నినగరాలకి సరఫరా చెయ్యగలను. నా దగ్గర

అచ్చమైన అనేక 'శూన్యం', 'పూజ్యం' నాణెపు నిల్వలున్నాయి. 

దానికి తోడు ప్రతి ఏడూ, సున్నాకీ, శూన్యానికీ 

మధ్య ఉన్నన్ని ఓడలనిండా వచ్చి పడిపోతుంటాయి.   

బంగారం, విలువైన రత్నాల రాశులయితే  నాదగ్గర

చక్రాల్లా చెక్కినవి వంద సున్నాల విలువైనవున్నాయి;

అన్నిటికంటే, అదంతా మిత్రులకి ఖర్చుచేసే స్వాతంత్య్రముంది.  

నేను ఖర్చుపెట్టడానికి వెనుకాడవలసిన పనిలేదు. 

నా సంపద భద్రతగురించి ఇసుమంతైనా భయపడనక్కర లేదు,

ఏ దొంగా దాన్ని దోచుకుని పోలేడు, దేముడి మీద ఒట్టు! 

.

(అనువాదం: D G రోజెటీ)    

బార్తలొమేయో ది సెయింట్ ఏంజెలో

13th Century  

ఇటాలియన్ కవి 

Sonnet

(He jests concerning his Poverty)

 

I am so passing rich in poverty

That I could furnish forth Paris and Rome,

Pisa and Padua and Byzantium,

Venice and Lucca, Florence and Forli;

For I possess in actual specie,

Of Nihil and of nothing a great sum;

And unto this my hoard whole shiploads come,

What between nought and zero, annually.

In gold and precious jewels I have got

A hundred ciphers’ worth, all roundly writ;

And therewithal am free to feast my friend.

Because I need not be afraid to spend,

Nor doubt the safety of my wealth a whit:

No thief will ever steal thereof, God wot.

.

Tr: D G Rosetti.

Bartolomeo di  Sant’ Angelo

Italian Poet

13th Century

https://archive.org/details/anthologyofworld0000vand/page/484/mode/1up



 

Sunday, July 5, 2020

మృత్యుఘంటికలు (సానెట్)... ఫ్రాన్సిస్కో దె కెబెదో, స్పానిష్ కవి


ఈ కవితలో కవి రెండు అవసాన దశకు వచ్చిన వస్తువులు తీసుకుని (స్వంత ఊరులో ఉన్న తన ఇల్లు, తన శరీరం) శిధిలమౌతున్న మొదటి వస్తువు ద్వారా, రెండవ దాని (తన శరీర) స్థితిని గ్రహించడం చక్కగా చూపిస్తాడు. మనం రోజూ చనిపోతున్న వాళ్ళనీ చూస్తుంటాం, శిధిలమైపోతున్నవీ చూస్తుంటాం. కానీ, రోజు రోజుకీ మనంకూడా తెలియకుండనే శిధిలస్థితికి చేరుకుంటున్నామన్న ఎరుక మనకి కలుగదు. 18వ శతాబ్దం వరకూ, మనదేశంలో కూడా ప్రతి ఊరుచుట్టూ, పెద్ద పెద్ద నగరాలకీ ఊరి/ నగర సరిహద్దులో చుట్టూ ఒక ప్రహారీ ఉండేదిట.

* * *

నా పుట్టిన ఊరి పొలిమేరల ప్రహారీని గమనించాను

ఒకప్పుడు దృఢంగా ఉండేది, ఇప్పుడు పాడుబడి పెల్లలూడిపోతోంది.  

ఇప్పటి తీరుకు తగ్గట్టు నిర్లక్ష్యానికి గురై ఆ గోడల శక్తి నశించింది  

ఒకప్పుడు మహోన్నతంగా ఉండే ప్రాకారాలు శిధిలమైపోయాయి.


నేను పొలాలు చూడటానికి వెళ్ళేను. అక్కడ అప్పుడే మంచు కరిగి

ఏర్పడ్డ నీటి తడిని సూర్యుడు ఆబగా తాగేయడం గమనించాను.

కొండవాలున పశువులు గిట్టలతో నేలదువ్వుతూ అరుస్తున్నాయి.

వాటి బాధలు చూసి ఇక్కడకు వచ్చిన ఆనందం ఆవిరైపోయింది. 



మా యింటికి వెళ్ళాను; తేమకి ఆ పాత గోడలు మచ్చలు పడి 

పాడు బడుతున్న వస్తువులన్నీ ఆ ఇంటిని కొల్లగొంటున్నాయి; 

అరిగిపోయిన నా చేతికర్ర అప్పుడే వంగిపోసాగింది.

కాలం గెలుస్తున్నట్టు గ్రహించాను; నా కత్తీ తుప్పుపట్టింది;

శిధిలం కానిది ఏదైనా ఉందేమో చూద్దామనుకుంటే

మచ్చుకి ఒక్కటికూడా కంటికి కనిపించలేదు.

.

ఫ్రాన్సిస్కో దె కెబెదొ

(14 September 1580 – 8 September 1645)

స్పానిష్ కవి




.


.

Sonnet: Death warnings

.

I saw the ramparts of my native land,

One time so strong, now dropping in decay,

Their strength destroyed by this new age’s way

That has worn out and rotted what was grand.

I went into the fields; there I could see

The sun drink up the waters newly thawed;

And on the hills the moaning cattle pawed,

Their miseries robbed the light of day for me.

 

I went into my house; I saw how spotted,

Decaying things made that old home their prize;

My withered walking-staff had come to bend.

I felt the age had won; my sword was rotted;

And there was nothing on which to set my eyes

That was not a reminder of the end.

.

(Tr: John Masefield)

Francisco de Quevedo y Villegas

(14 September 1580 – 8 September 1645)

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/645/mode/1up


Friday, July 3, 2020

సానెట్ 2 … లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి



నా పెదవినుండి వెలువడిన మధుర గీతాల్లారా, నను విడిచిపొండి,

సంగీతానికి శృతిబద్ధమైన వాద్యపరికరాల్లారా, నను వీడిపొండి,

మైదానాల్లోని రమణీయమైన ఎగిసే నీటిబుగ్గలారా, నను వీడిపొండి

కొండకోనల్లోని మంత్రముగ్ధుణ్ణిచేసే తరు, లతాంతాల్లారా, నను వీడిపొండి, 

అనాదిగా వేణువునుండి వెలువడుతున్న రసధునులారా, నను విడిచి పొండి,

జనపదాల్లోని విందు, వినోద, జాతర సమూహాల్లారా, నను విడిచిపొండి,

రెల్లుపొదలలోదాగిన జంతు, పక్షి సమూహాల్లారా, నను వీడిపొండి,

శీతలతరుచాయలలో హాయిగా విశ్రమించే గోపకులారా, నను వీడిపొండి,



నాకిపుడు ఏ సూర్య చంద్రులూ ఉదయించి వెలుగులీనబోరు,

మనః శాంతి అంతరించి,చీకటి నాపై పెను పొరలా కమ్ముకుంది

నాకిక దిక్, దిగంతరసిమలలో ఎక్కడా సంతోషమన్నది కనరాదు,

నేను ఆశించినవీ, ప్రేమించినవీ నశిస్తే ఇక నశించనీ,

కానీ, ఓ నా దౌర్భాగ్యమా! నువ్వు మాత్రం నన్ను విడిచిపోకు, 

చివరకి ప్రాణాలు హరించి నాకు విముక్తి కలిగించగలిగేది నువ్వే!

.

  (అనువాదం: రిఛర్డ్ గార్నెట్)

లూయిజ్ వాజ్ ది కమోజ్  

(1524 or 1525 – 20 June1580) 

స్పానిష్ కవి

.


.

Sonnet

.

Leave me, all sweet refrains my lip hath made;

Leave me, all instruments attuned for song;

Leave me, all fountains pleasant meads among;

Leave me, all charms of garden and of glade;

Leave me, all melodies the pipe hath played;

Leave me, all rural feast and sportive throng;

Leave me, all flocks the reed beguiles along;

Leave me, all shepherds happy in the shade.

 

Sun, moon, stars, for me no longer glow;

Night would I have, to vail for vanished peace;

Let me from pole to pole no pleasure know;

Let all that I have loved and cherished cease;

But see that thou forsake me not, my Woe,

Who wilt, by killing, finally release.

.

(Tr: Richard Garnett)

Luís Vaz de Camões

(1524 or 1525 – 20 June1580

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/635/mode/1up

Thursday, July 2, 2020

సానెట్... లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి


కాలమూ మనిషీ ఎన్నడూ స్థిరంగా ఉండరు;

అదృష్టం దూరమైన మనిషి ధైర్యమూ దూరమౌతుంది;

సరి కొత్త స్వభావాన్ని సంతరించుకున్న ప్రకృతితో 

ఈ ప్రపంచమంతా "తిండిపోతు మార్పు" ఆహారంలా కనిపిస్తోంది.



ఏ దిక్కు చూసినా అంతులేని సరికొత్త చిగుళ్ళు కనుపిస్తున్నాయి 

ఎంతగా అంటే, ఈ భూమి ఇంత భరించగలదని ఊహించలేనంత.

బహుశా గతాన్ని గురించిన శోకమే నిలకడగా ఉంటుంది, 

గతంలో చేసిన మంచికై వగపూను, అది నిజంగా మంచి అయితే. 



కాలం పచ్చదనంతో మొన్నటిదాకా ఈ మైదానాన్ని ఉల్లాసం నింపింది. 

ఇప్పుడు హేమంతపు మంచుసోనలతో తెల్లని తివాచీ పరుస్తోంది  

నా పాట ఈ సమయంలో విషాద రాగాలాపనకి ఆయత్తమౌతోంది 

అన్నిటికంటే ముఖ్యంగా, నేను సోకించే సందర్భం

మానవ సమూహం గురించే; వాళ్ల మార్పు ఎప్పుడూ చెడువైపే, 

నీ లా, కనీసం అరుదుగానైనా, మంచిని చేయ తలపోయరు గదా! 

.

(అనువాదం:  రిఛర్డ్ గార్నెట్)    

లూయిజ్ వాజ్ ది కమోజ్  

(1524 or 1525 – 20 June1580) 

స్పానిష్ కవి



.


.

Sonnet

.

Time and mortal will stand never fast;

Estranged fates man’s confidence estrange;

Aye with new quality imbued, the vast

World seems but victual of voracious change.

 

New endless growth surrounds on every side,

Such as we deemed not earth could ever bear,

Only doth sorrow for past woe abide

And sorrow for past good, if good it were.

 

Now Time with green hath made the meadows gay,

Late carpeted with snow by winter frore,

And to lament hath turned my gentle lay;

Yet of all change chiefly I deplore,

The human lot, transformed to ill alway,

Not chequered with rare blessing as of yore.

(Tr.:  Richard Garnett)

Luís Vaz de Camões

(1524 or 1525 – 20 June1580

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/636/mode/1up?q=614


Wednesday, July 1, 2020

మంచు సోన ... కర్దూచీ, ఇటాలియన్ కవి


చీకటి ముసిరిన ఆకాశం నుండి నిశ్శబ్దంగా, నెమ్మదిగా కురుస్తోంది మంచు

నగరంలో, అరుపులూ, జీవవ్యాపారాల సందడీ సద్దుమణుగుతోంది



పరిగెడుతున్న చక్రాల శబ్దాలూ, వీధి వర్తకుల అరుపులూ,

యువత కేరింతలూ, ప్రేమగీతాలూ వినిపించడం లేదు. 



కాలావధులు లేని ప్రపంచపు నిట్టూర్పుల్లా, నిద్రపోతున్న మెట్లమీదుగా  

లోహపుజాడీనుండి గంటలు కరకుగా బొంగురుగా మూలుగుతున్నాయి.  



దారితప్పిన పక్షులు కిటీకీ అద్దాలమీద పదే పదే  కొట్టుకుంటున్నాయి 

నా సహచర ప్రేతాత్మ మిత్రులు వెనుదిరిగి, నావంకచూస్తూ పిలుస్తున్నారు. 



శలవు ప్రియతములారా, త్వరలో కలుద్దాం, భయమెరుగని ఓ మనసా!   

పద!నీరవంలోకి అడుగువేస్తున్నా, ఆ నీడలోనే విశ్రమిస్తా. 

.

(అనువాదం: రొమిల్డా రెండెల్) 

జియొస్యూ కర్దూచీ 

(27th July 1835 – 16th Feb 1907)

ఇటాలియన్ కవి



Snowfall

.

Silently, slowly falls the snow from an ashen sky,

Cries, and sounds of life from the city rise no more,

 

No more the hawker’s shout and the sound of running wheels,

No more the joyous song of love and youth arise.

 

Raucously from the somber spire through the leaden air

The hours moan, like sighs of a world removed from time.

Wandering birds insistent knock on the glowing panes.

My ghostly friends return, and gaze, and call me.

 

Soon, my dear ones, soon—be still, O dauntless heart—

Down to the silence I come, in the shadow I will rest.

.

(Tr: Romilda Rendel) 

Giosuè Carducci 

(27th July 1835 – 16th Feb 1907)

Italian Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/611/mode/1up

The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...