Wednesday, June 17, 2020

ఉమర్ ఖయ్యాం 5 రుబాయీలు... ఎడ్వర్ద్ ఫిజెరాల్డ్ అనువాదం




ఒకపొదరింటి గూటిలో, ఒక కవిత్వం పుస్తకం,

తినడానికి రొట్టె, త్రాగడానికి కూజాతో మధువు,

ఆరుబయట సంగీతాలాపనకి చెంత నువ్వూ,

ఆహ్! ఈ ఆరుబయలును మించిన స్వర్గం ఏముంది?                         12




కొందరు ఈ ప్రపంచంలో కీర్తిప్రఖ్యాతులకి తపిస్తే 

కొందరు ప్రవక్తలాశించిన స్వర్గ సృష్టికి పరితపిస్తారు;

ఇంద ఈ సంపద, పేరెవరికొస్తే నీ కెందుకు, ఊరుకో

దూరాన వినిపిస్తున్న మరణ మృదంగాన్ని పట్టించుకోకు.                    13





తననే తిలకిస్తున్న గులాబి మమ్మల్ని చూసి ఏమంటోందో విను: 

"చూడు, నేను విచ్చుకుంటున్న ప్రపంచం నను చూసి హసిస్తోంది

నా అందాలకి ఆకరమైన పట్టుకుచ్చెల తొడిమెతో బంధం

తెంచగనే, ఇంతటి నా సంపదంతా తోటమట్టి పా లవుతుంది.             14  





బంగారు తృనాన్ని అక్కునజేర్చుకున్న వారూ

గాలికి చెదిరే చినుకులా లెక్కచెయ్యని వారూ

ఎవరూ బంగారు గనిగా అవతరించబోరు 

ఒకసారి పాతిపెట్టినదేదైనా పెల్లగించక తప్పదు.                                    15





లౌకిక లక్ష్యాలకు మనసు పారేసుకున్నవారు 

వాటిని సాధించవచ్చు, లేదా విఫలురవొచ్చు; కానీ

ఎడారి ఇసుకమీద కురిసిన మంచు సోనలా 

క్షణమాత్రం అద్భుతంగా ప్రకాశించి మరుగౌతారు.                                    16


.

ఉమర్ ఖయ్యాం

18 May 1048 – 4 December 1131

Persian Poet, Philosopher Mathematician and astronomer

(అనువాదం : ఎడ్వర్ద్ ఫిజెరాల్డ్  )


Omar Khayyam's Rubayats

.

A book of verses underneath the Bough,
A Jug of Wine, a Loaf of Bread- and thou
Beside me singing in the Wilderness-
Oh, Wilderness were Paradise enow!                                    12


Some for the Glories of This World; and some
Sigh for the Prophet’s Paradise to come;
Ah, take the Cash, and let the Credit go,
Nor heed the rumble of a distant Drum!                               13

`Look to the blowing Rose about us- “Lo,
Laughing,” she says, “into the world I blow,
At once the silken tassel of my Purse
Tear, and its Treasure on the Garden throw.”                       14

And those who husbanded the Golden Grain,
And those who flung it to the winds like Rain
Alike to no such aureate Earth are turned
As, buried once, Men wart dug up again.                               15

The Worldly Hope men set their Hearts upon
Turns Ashes- - or it prospers; and anon,
Like Snow upon the Desert’s dusty Face,
Lighting a little hour or two- is gone.                                       16
.

Omarkhayyam

18 May 1048 – 4 December 1131

Persian Poet, Philosopher Mathematician and astronomer




Translator : Edward FitzGerald
(31 March 1809 – 14 June 1883)
English Poet and Translator



Poems Courtesy:

Tuesday, June 16, 2020

సుగుణానికి మూల్యం


కొమ్మల నిండుగా పండ్లు కాసిన చెట్టు

వాటి బరువుకే తలవంచుకోవలసి వస్తుంది; 

మగనెమలికి తన వన్నెల వింజామరల బరువుకి

నెమ్మదిగా అడుగులు వేయక తప్పనిసరి అవుతుంది ,

పరుగుపందాన్ని అవలీలగా గెలిచిన జవనాశ్వానికి 

రౌతు ముందర గోవులా వినయంగా నడువవలసి వస్తుంది, 

చిత్రంగా, మంచితనంలోని మంచికి ఎప్పుడూ 

అందులోనే భయపడదగిన శత్రువు కనిపిస్తాడు. 


నీలి నీలి కెరటాలతో ప్రవహించే యమున 

ఇంద్రనీలమణి కాంతుల సైకతశ్రోణులలోనే 

కృష్ణసర్పాలు తమ నెలవులు చేసుకునేది,

అల్లంత దూరాన్నుండే వాటి శిరసునున్న 

మణులు ప్రతిఫలించే కాంతిపుంజాల్ని చూసి

దగ్గరకు వెళ్ళడానికి ఎవరు సాహసించగలరు? 

ఏ సుగుణం కీర్తిశిఖరాలని అధిరోహింపజేస్తుందో  

ఆ సుగుణమే అధః పాతాళానికికూడా తోస్తుంది.    


సల్లక్షణాలున్న వాడెవడూ

రాజానుగ్రహానికి పాత్రుడు కాలేడు.

మూర్ఖులనీ, ధూర్తులనీ సిరులు

అలవాటుగా, అలవోకగా వరిస్తే,

'మనిషి సుగుణమే అతని గొప్పదన'మనే నానుడి 

నమ్మినవాడు అనాదరణతో నశించవలసిందే.

ఈ ప్రపంచం ఎన్నడూ, అరుదుగానైనా

నిజమైన సాహసకృత్యాన్ని గుర్తించదు. 

.

పంచతంత్రం నుండి

అనువాదం: ఆర్థర్ W రైడర్.



From Panchatantra

 

The Penalty of Virtue

 

The fruit-tree’s branch by very wealth

Of fruit is bended low;

The peacock’s feathered pride compels

A sluggish gait and slow;

The blooded horse that wins the race,

Must like a cow be led;

The good in goodness often find

An enemy to dread.

 

Where Jamuna’s waves roll blue

With sands of sapphire hue,

Black serpents have their lair;

And who would hunt them there,

But that a jewel’s bright star

From each hood gleams afar?

By virtue rising, all

By that same virtue fall.

 

The man of virtue commonly

Is hateful to the king,

While riches to the scamps and fools

Habitually cling:

The ancient chant ‘By virtue great

Is man’ has run to seed;

The world takes rare and little note

Of any plucky deed.

.

(Translation : Arthur W. Ryder)

https://archive.org/details/anthologyofworld0000vand/page/58/mode/1up


Monday, June 15, 2020

2 poems of Japanese Poet Saigyō Hōshi from Shūi Wakashū

వాస్తవమని భావించేది ఏదీ

వాస్తవం కాదని 

నేను విశ్వసించినందువల్ల

ఇప్పుడు కలల్ని

కలలని ఎలా ఒప్పుకోగలను?

.

గమ్యం తెలియని తీరాలకు

ఒకదాని ప్రక్కనే ఒకటిగా

ఒకే ఓడరేవునుంచి

బయలు దేరిన నౌకలు 

ఇపుడు ఒకదానికొకటి దూరంగా పోతున్నాయి!


కెరటాలు ఎప్పుడూ ఉధృతంగా ఎగసిపడే

విశాలమైన ఆసియా సముద్రతలాలనుండి

భద్రంగా తిరిగివస్తున్న పడవలని చూస్తుంటే 

ఆటుపోటులతో నిండిన జీవితపు తుఫానులనుండి 

నేనుకూడా సురక్షితంగా బయటపడగలననిపిస్తోంది. 

.

సైగ్యో హోషీ

(1118- 23 మార్చి 1190) 

జపనీస్ కవి

(అనువాదం: ఆర్థర్ వేలీ)


Image Courtesy: Wikipedia


Since I am convinced

That Reality is in no way

Real

How am I to admit

That dreams are dreams?

.

Those ships which left

Side by side

The same harbor

Towards an unknown destination

Have rowed away from one another!

 

Like those boats which are returning

Across the open sea of Ashiya

Where the waves run high,

I think that I too shall pass

Scatheless through the storms of life.

 

(Translation; Arthur Waley)

Saigyō Hōshi (Born Satō Norikiyo)

(1118 March 23, 1190)

Japanese Poet of  Late Heian and early Kamakura Period

https://archive.org/details/anthologyofworld0000vand/page/48/mode/1up

 


Friday, June 12, 2020

Vision... Iqbalchand, Telugu Poet, Indian

Vision

.

This is an extremely dangerous Faltoo* (toxin)

 

It lets me not sleep

At the same time,

Keeps me not fully awake.

 

A kind of walking through

A self-inflicted  

Subtle, ineffective, violent

Nightmare of an artist.  

 

Its like the wet sand

That melts under the feet

Under the high- and low-tides

On a full moon night.

 

It’s a cruel, merciless hungry metonymic cavern.  

 

It neither lets me live

Nor

Kills me in one go.

.

Iqbal Chand

 

Note: Faltoo is a toxin prepared from the poppy seeds  which was widely prevalent during Mughal period. Its preparation is banished now and the word acquired a different connotation now.





రూపకం

అత్యంత ప్రమాదకరమైన ఇదొక ఫాల్తూ,

నిద్ర పోనివ్వదు
అలా అని
మెలుకువనూ వొప్పుకోదు,

ఇదొక అత్యంత స్వీయ హింసాత్మక
నిష్ఫల నాజూకు
చిత్రకారుని సగం స్వప్నం -

పౌర్ణమి తొలిరేయి
వొస్తూ పోయే ఆటూ పోట్ల నడుమ
కాళ్ళ కింద హరించుకొని పోతోన్న తడి ఇసుక -

అత్యంత క్రూరమైన ఇదొక ఆకలి పులిగుహ metonymy -

బతకనివ్వదు
అలా అని
వొక్కసారిగా చంపేయదు –
---

ఇక్బాల్ చంద్ .

PS: ఫాల్తూ అంటే ఇదొక రకమైన స్లో పొయిసన్. గసగసాలతో పాటు మరికొన్ని రసాయనాలు కలిపి దీన్ని తయారు చేస్తారట.. మొఘలాయి రాచరికపు రోజుల్లో దీని వాడకం ఎక్కువగా వుండేది. ఇప్పుడు అది నిషేధం. ఇప్పుడు వాడకం లో దీని అర్థం మారిపోయింది. అది వేరే సంగతి.

 


The Letter Unwritten... Asharaju, Telugu Poet, India

Whether you have condemned them as useless

Or, forgotten while trimming your wares

Some of your belongings

Somehow, were left behind with me.

Please take them away when you come this way!

 

The sweet scents of your tresses

Still linger over my shoulder;

And your lukewarm breath

Is tangible at the nape of my neck;

They had slipped out, in your hurry

Which, praps, you never noticed.

Whenever you come this way

Please take them with you!

 

The smiles you broadcast over the mirror

And the wet foot prints you left drying under the fan

Lie scattered all across the room, like a starry sky.

Whenever you find time, please take them away

Packing lock stock and barrel.

 

The night - we shared the Chai fifty-fifty-

froze in the balcony,

The moon who overheard the King-Queen stories

Fell asleep at the threshold of the house.

If you chance to come alone, anytime, this way

Carry everything; leave nothing behind.

 

Wherever I turn, I see your things wrapped up;

They are coming in my way

Leaving no room for me to sit, or stand free.

Come, without any further delay, 

Search every nook and corner, and

Carry away all your belongings!

 

Then, I could find at least

Some room for me … to die.

.

Asaaraju

(Born 5th Dec 1954)

Telugu Poet

Born and brought up in Hyderabad old city, Sri Asharaju is a prolific poet.  He has to his credit 19  volumes of poetry and  2 translations.  Another renowned port  Sowbhagya (Palella Vijaykumar) brought out a critique on Asharaju's poetry in 2011.  He received innumerable awards for his poetry, including the Freeverse front award and Ci.Na.Re. literary Award. He can be contacted at 93923 02245 .


Asha Raju

రాయని ఉత్తరం

 

సర్దుకోవడంలో 

మరిచిపోయావో 

పనికిరానివని 

వదిలేశావో  

నీ వస్తువులుకొన్నీ 

నా దగ్గరేవుండిపోయాయి 

ఇటువైపు వచ్చినపుడు 

వాటిని తీసుకెళ్ళు !

 

నా భుజంమీద  ఎగురుతున్న 

నీ కురులపరిమళం  

నా మెడచుట్టూ తగులుతున్న 

నీ ఊపిరి వెచ్చదనం  

నీ తొందర తొందరపనుల్లో 

జారి కిందపడ్డట్టున్నాయి 

ఎప్పుడు ఇటువచ్చినా  

నీవస్తువులు నీవు తీసుకెళ్ళు !

 

నిలువుటద్దంమీద  

వెదజల్లిన నీనవ్వులు  

ఫ్యానుగాలికింద ఆరేసిన 

నీ తడిఅడుగులు  

ఆకాశంలో చుక్కల్లా  

ఇల్లంతా పరుచుకొన్నాయి 

ఎప్పుడో తీరికదొరికినప్పుడువచ్చి 

అన్నీ మడతబెట్టుకొని తీసుకెళ్ళు ! 

 

సగం సగం చాయ్ తాగినరాత్రి  

బాల్కనీలోనే నిలిచిపోయింది  

రాజా రాణీల కతలువిన్న చందమామ  

దర్వాజా దగ్గరే నిద్రపోయింది 

అనుకోకుండా ఒక్కదానివే

ఈ దారిన వచ్చినప్పుడు  

ఒక్కటికూడామిగలకుండా తీసుకెళ్ళు ! 

 

నేను ఎటుకదిలినా  

మూటలుకట్టిన నీవస్తువులే

అడ్డుపడి దొర్లుతున్నాయి  

నిలుచోలేను కూర్చోలేను  

ఆలస్యం చేయకుండావచ్చి 

మూల మూలల వెతికి వెతికి 

వదిలేసిన వస్తువులన్నీ తీసుకెళ్ళు ! -----, 

కనీసం మరణించడానికైనా  

నాకు కొంచెం ఖాలీ స్థలందొరుకుతుంది

.

ఆశారాజు

తెలుగు కవి

సెల్ నం: 93923 02245


వాలిపోతున్న బార్లీ పంటలా... సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

సముద్రతలానికి దిగువన

గాలివాటుకి తలవాల్చినా

నిరంతరాయంగా కూని రాగాలు

తీసుకునే బార్లీపంటలా

 

తలను వాల్చినా, మళ్ళీ

తలెత్తుకునే బార్లీపంటలా

నేనుకూడా, బీటలువారకుండా

ఈ బాధనుండి బయటపడతాను.

 

నేనూ అలాగే, నెమ్మదిగా

ప్రతి పగలూ, ప్రతిరాత్రీ

దిగమింగుతున్న దుఃఖాన్ని

గేయంగా మలుచుకుంటాను.

.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి



Sara Teasdale

Like Barley Bending

.

Like barley bending

In low fields by the sea,

Singing in hard wind

Ceaselessly;

 

Like Barley bending

And rising again,

So would I, unbroken,

Rise from pain;

 

So would I softly,

Day long, night long,

Change my sorrow

Into song.

.

Sarah Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American Poet. 

From:

Sara Teasdale Poems Published by PoemHunter.com - The worlsd's Poetry Archive, 2004  under Clessic Poetry Series.

తోటమాలి ... రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి

నీకు అదే ఇష్టమనిపితే

నా పాటని ఇప్పుడే ఆపేస్తాను.

 

నీ గుండె ఉద్వేగానికి లోనవుతోందంటే

నీ ముఖంలోకి చూడడం విరమించుకుంటాను. 

 

నడుస్తూ నడుస్తూ, ఆశ్చర్యంతో అడుగు తడబడితే  

నేను ప్రక్కకి తొలగి, వేరే దారి చూసుకుంటాను.

 

పూదండ గ్రుచ్చుతూ తడబడుతున్నావంటే

అలికిడిలేని నీ తోటవంక కన్నెత్తైనా చూడను. 

 

ఈ కొలనునీరు తుంటరిగా నీపైకి ఎగురుతోందంటే

ఈ ఒడ్డున నా పడవ నడపడమే మానుకుంటాను.

.

రబీంద్రనాథ్ టాగోర్

(7 May 1861 – 7 August 1941)

భారతీయ కవి


The Gardener

 

If you would have it so,

I will end my singing.

 

If it sets your heart aflutter,

I will take away my eyes from your face.

 

If it suddenly startles you in your walk,

I will step aside and take another path.

 

If it confuses you in your flower-weaving,

I will shun your lonely garden.

 

If it makes the water wanton and wild,

I will not row my boat by your bank.

.

Rabindranath Tagore

(7 May 1861 – 7 August 1941)

Indian Poet

 

Poem Courtesy:  Contributed by Nirupama Ravindra


The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...