ఒకపొదరింటి గూటిలో, ఒక కవిత్వం పుస్తకం,
తినడానికి రొట్టె, త్రాగడానికి కూజాతో మధువు,
ఆరుబయట సంగీతాలాపనకి చెంత నువ్వూ,
ఆహ్! ఈ ఆరుబయలును మించిన స్వర్గం ఏముంది? 12
కొందరు ఈ ప్రపంచంలో కీర్తిప్రఖ్యాతులకి తపిస్తే
కొందరు ప్రవక్తలాశించిన స్వర్గ సృష్టికి పరితపిస్తారు;
ఇంద ఈ సంపద, పేరెవరికొస్తే నీ కెందుకు, ఊరుకో
దూరాన వినిపిస్తున్న మరణ మృదంగాన్ని పట్టించుకోకు. 13
తననే తిలకిస్తున్న గులాబి మమ్మల్ని చూసి ఏమంటోందో విను:
"చూడు, నేను విచ్చుకుంటున్న ప్రపంచం నను చూసి హసిస్తోంది
నా అందాలకి ఆకరమైన పట్టుకుచ్చెల తొడిమెతో బంధం
తెంచగనే, ఇంతటి నా సంపదంతా తోటమట్టి పా లవుతుంది. 14
బంగారు తృనాన్ని అక్కునజేర్చుకున్న వారూ
గాలికి చెదిరే చినుకులా లెక్కచెయ్యని వారూ
ఎవరూ బంగారు గనిగా అవతరించబోరు
ఒకసారి పాతిపెట్టినదేదైనా పెల్లగించక తప్పదు. 15
లౌకిక లక్ష్యాలకు మనసు పారేసుకున్నవారు
వాటిని సాధించవచ్చు, లేదా విఫలురవొచ్చు; కానీ
ఎడారి ఇసుకమీద కురిసిన మంచు సోనలా
క్షణమాత్రం అద్భుతంగా ప్రకాశించి మరుగౌతారు. 16
.
ఉమర్ ఖయ్యాం
18 May 1048 – 4 December 1131
Persian Poet, Philosopher Mathematician and astronomer
(అనువాదం : ఎడ్వర్ద్ ఫిజెరాల్డ్ )
Omar Khayyam's Rubayats
.
A book of verses underneath the Bough,
A Jug of Wine, a Loaf of Bread- and thou
Beside me singing in the Wilderness-
Oh, Wilderness were Paradise enow! 12
Some for the Glories of This World; and some
Sigh for the Prophet’s Paradise to come;
Ah, take the Cash, and let the Credit go,
Nor heed the rumble of a distant Drum! 13
`Look to the blowing Rose about us- “Lo,
Laughing,” she says, “into the world I blow,
At once the silken tassel of my Purse
Tear, and its Treasure on the Garden throw.” 14
And those who husbanded the Golden Grain,
And those who flung it to the winds like Rain
Alike to no such aureate Earth are turned
As, buried once, Men wart dug up again. 15
The Worldly Hope men set their Hearts upon
Turns Ashes- - or it prospers; and anon,
Like Snow upon the Desert’s dusty Face,
Lighting a little hour or two- is gone. 16
.
Omarkhayyam
18 May 1048 – 4 December 1131
Persian Poet, Philosopher Mathematician and astronomer
Translator : Edward FitzGerald
(31 March 1809 – 14 June 1883)
English Poet and Translator
Poems Courtesy:
No comments:
Post a Comment