There comes a feeling of someone moving around
Whisking the lips a gentle breeze passes by
A brief lightening drizzle ensues, and then a clear sky.
Umm! The nascent smell of freshly-wet earth suddenly
sieges me.
Poor lips! How long have they been parched!
They were all smiles in rapture and goosebumps.
We never really know how dearly we love this earth.
Even when it curses … going dry, desiccated and cracked
Abuses… going soggy, damp and wet; or,
Embraces … with its intoxicating jasmine fragrance,
We never feel wan, weary and satiated.
I don’t dispute the uniqueness of the ether
But the earth, that can retain any number of cloud tears
Is so dear to me!
You know! The soul of earth is the essence of life!
.
Sri Sudha Modugu
Sri Sudha Modugu is in medical field, working in Kingston, Jamaica. She has 2 Poetry collections, అమోహం and విహారి, and a short story collection 'రెక్కలపిల్ల' to her credit.
ప్రేరణ
.
ఎవరో సన్నగా కదిలినట్లనిపించింది
చిన్నగాలి పెదాలపై
వీచి
నాలుగు చినుకులు మెరుపులా
కురిసి వెళ్ళాయి
ఒక్కసారిగా మట్టివాసన
అద్భుతంగా చుట్టుకుంది
ఎంతగా ఎండిపోయి ఉన్నాయో
పెదాలు
పులకరించి పరవశించి
నవ్వుకున్నాయి
మట్టిని ఎంతగా ప్రేమిస్తామో
ఎప్పుడూ తెలీదు
అది బీటలు బారి పగుళ్ళిచ్చి శపించినా
చిత్తడై బురదలేసి తిట్టిపోసినా
మల్లెలంత మృదువుగా
మత్తుగా హత్తుకున్నా
ఎందుకో ఎప్పుడూ విసుగురాదు
ఆకాశం అనన్యం అని ఒప్పుకుంటా
కానీ
ఎన్ని చినుకులనైనా
రహస్యంగా దాచుకునే
మట్టంటే ప్రాణమే అనిపిస్తది
'You
know, the soul of earth is the essence of life'
.
శ్రీ సుధ మోదుగు
తెలుగు కవయిత్రి
No comments:
Post a Comment