Wednesday, October 28, 2020

A Nascent Song... Vadrevu Chinaveerabhadrudu, Telugu, Indian

 

Day did not break yet

A wake up song echoes from the foot of the hill

The city afloat in the morning mist.

Lest it should sink under the weight of its dreams

A spinning melody lugs it back to the bank.

The sky and earth

Are deep asleep on the horizon.

The houses and trees

Breathing heavy in REM

 

Before long, all homes will be abuzz

And the city lights shall sink in the dazzling waters

I will be watching this aubade

And dearly wish the dawn to delay.

 

The day begins. Letters,

Greetings, instructions, delegation

The buck shall not stop with me

Nor anything sinks in.

As night deepens,

And all the letters are out, from in-box

I recall the morning song

Like I read and reread

The letter of an intimate friend.

And the vine that hooked to me

In the wee hours of the day,

Blossoms late in the night.

 

And I wait through the night

Savoring its scents to find what it is.

.

V. Chinaveerabhadrudu. 

 


Vadrevu Chinaveerabhadrudu

పొద్దుటికి పరిమళించే పాట

.

 

ఇంకా తెల్లవారని అయిదుగంటలవేళ

కొండకింద గుడిలోంచి సుప్రభాతకీర్తన.

పడవలాగా మంచులో తేలుతున్న పట్టణం

కలల బరువుకి కిందకి ఒరిగిపోకుండా

తాడు కట్టి ఒడ్డుకి లాగుతున్న పాట.

అకాశమూ, భూమీ ఒకదానిమీద ఒకటి చేతులు వేసుకుని

ఆదమరిచి నిద్రపోతున్నాయి

ఇళ్ళూ, చెట్లూ గాఢనిద్రలో

బరువుగా ఊపిరి తీస్తున్నాయి.

ఇప్పటికో మరికాసేపటికో ఇళ్ళు మేల్కొంటాయి

వెలుగునీటిలో విద్యుద్దీపాలు కుంకిపోతాయి.

బాల్కనీలో నిలబడి

నేనా పాటనే పరికిస్తుంటాను.

తెల్లవారడం మరికొంత సేపు వాయిదా పడితే

బాగుండనుకుంటాను.

రోజు మొదలవుతుందిఉత్తరాలు

పలకరింపులు, పనులు, పురమాయింపులు

ఏ ఒక్క సమాచారమూ నా దగ్గర ఆగదు

ఏ ఒక్కటీ నాలోకి ఇంకదు.

రాత్రయ్యేటప్పటికి

అన్ని ఉత్తరాలూ, ఫైళ్ళూ

నా ఇన్ బాక్సులోంచి వెళ్ళిపోయేక

అప్పుడు తలుచుకుంటాను

ఆ పొద్దుటిపాటని-

ఆత్మీయురాలి ఉత్తరం

మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్టు.

ఇంకా తెల్లవారని వేళ

నాలోకి కుసుమించిన ఆ తీగ

రాత్రయ్యేటప్పటికి

పువ్వు పూస్తుంది.

ఆ పరిమళమేమిటో పోల్చుకోడానికి

మళ్ళా పొద్దుటిదాకా ప్రతీక్షిస్తాను.
.
వాడ్రేవు చినవీరభద్రుడు 
తెలుగు కవి



Wednesday, October 14, 2020

Inspiration... Sri Sudha Modugu, Telugu, Indian

 

 

There comes a feeling of someone moving around

Whisking the lips a gentle breeze passes by

A brief lightening drizzle ensues, and then a clear sky.

 

 

Umm! The nascent smell of freshly-wet earth suddenly sieges me.

Poor lips! How long have they been parched!

They were all smiles in rapture and goosebumps.

 

We never really know how dearly we love this earth.

 

Even when it curses … going dry, desiccated and cracked

Abuses… going soggy, damp and wet; or,

Embraces … with its intoxicating jasmine fragrance,

We never feel wan, weary and satiated.

 

I don’t dispute the uniqueness of the ether

But the earth, that can retain any number of cloud tears

Is so dear to me!

 

You know! The soul of earth is the essence of life!

.

 

Sri Sudha Modugu

 

 


Sri Sudha Modugu is in medical field, working in Kingston, Jamaica.  She has 2 Poetry collections, అమోహం and విహారి, and a short story collection 'రెక్కలపిల్ల' to her credit.   


ప్రేరణ

.

ఎవరో సన్నగా కదిలినట్లనిపించింది

చిన్నగాలి పెదాలపై వీచి

నాలుగు చినుకులు మెరుపులా కురిసి వెళ్ళాయి

 

ఒక్కసారిగా మట్టివాసన అద్భుతంగా చుట్టుకుంది

ఎంతగా ఎండిపోయి ఉన్నాయో పెదాలు

పులకరించి పరవశించి నవ్వుకున్నాయి

 

మట్టిని ఎంతగా ప్రేమిస్తామో ఎప్పుడూ తెలీదు

 

అది బీటలు  బారి పగుళ్ళిచ్చి శపించినా

చిత్తడై బురదలేసి తిట్టిపోసినా

మల్లెలంత మృదువుగా మత్తుగా హత్తుకున్నా

ఎందుకో ఎప్పుడూ విసుగురాదు

 

ఆకాశం అనన్యం అని ఒప్పుకుంటా కానీ

ఎన్ని చినుకులనైనా రహస్యంగా దాచుకునే

మట్టంటే ప్రాణమే అనిపిస్తది

 

'You know, the soul of earth is the essence of life'

.

 

శ్రీ సుధ మోదుగు 

తెలుగు కవయిత్రి

Tuesday, October 13, 2020

A Self-exile ... Bandi Satyanarayana, Telugu, Indian

Everyone lives on his own

carrying overhead
his own firmaments,
dragging body with one hand
and life with another,
Poor chap! He is so innocent.
just breathing life
jettisoning all cares.
  
He entertains no fears
of ‘how to live?'
He doesn't hurry,

veils no grief,
never burns with envy,
Or, never falters
missing his own footfalls
Never accuses the world
Nor commits suicide.


strangely,
he enjoys everything,
even his grief. 


He yields 
to no fancies
And to illusions.


Making each experience a steppingstone

He steadily climbs up

 

 

A man so confident of himself,

 

Loves himself, and 


A self-exile.

.

Dr. Bandi Satyanarayana 


Dr. Bandi Satyanarayana is a Senior Announcer at AIR Visakhapatnam by profession but is a poet by passion.  He has ten volumes of poetry to his credit already.  His biography of Sri Puripanda Appalaswamy was published by Visalandhra Publishers.  His radio play on the lives of fishermen titled "Darijere Daari (The way to reach ashore) won AIR's Annual National Award. And his long poem "Punarapi JananaM (Cycle of Birth...)" was well received in poetry circles.  He also wrote a five-footed Satakam (a centum of poems) titled "Tamasoma Jyotirgamaya (Lead Kindly Light).

స్వాంతర వాసి
.

అందరూ వాళ్ళ వాళ్ళ
ఆకాశాల్ని నెత్తిన పెట్టుకొని
బతుకుతుంటారు
ఒక చేత్తో దేహాన్ని
మరో చేత్తో జీవితాన్ని
ఈడ్చుకుంటూ పోతుంటే
ఇతనెవరో
అమాయకుడిలా వున్నాడు
రవంత గాలి పీల్చుకుని
బతికేస్తున్నాడు

ఇతను బతకడానికి
భయపడడు
కంగారు పడడు
దుఃఖాన్ని కప్పుకోడు
ఈర్ష్యతో కాలిపోడు
పాదాల్ని కోల్పోయి
తప్పుటడుగులు వేయడు
లోకాన్ని తిట్టి పోసేయేడు
విసిగి అసువులు బాయడు
అన్నిటనీ
ఆస్వాదిస్తాడు
దుఃఖాన్నీ కూడా

ఇతను వూహలకి
లోనవని వాడు
భ్రమలకి లొంగని వాడు

ఇతను అనుభవాలను
మెట్లుగా చేసుకుంటూ
ఒక్కొక్కటిగా ఎక్కిపోతుంటాడు 

ఇతను తనకి తాను బాగా తెలిసినవాడు
 
ఇతను తనని తానే ప్రేమించుకున్నవాడు

ఇతనొక స్వాంతరవాసి.


బండి  సత్యనారాయణ

Triflers... Bhaskar Kondreddy, Telugu Poet, Indian

 


4

Some people say

Love is a very small thing in life.


What else, perhaps,

Can the people say

Who see life as but a well?

she said hiding him in her embrace.


10


"Just as this body is made up of bones

Life is an amalgam of experiences," he said

With a philosophical touch in his eyes.


Savoring the taste of

Boneless labia oris,  she said

Neither bones are experiences,

and experiences could be romanced,

Nor this body ... a paradigm of life. 

.

Bhaskar Kondreddy


బేకారీలు 

4

కొంతమంది అంటారు

ప్రేమ చాలా చిన్న అంశమని, జీవితంలో


బహుశా ఈ ప్రపంచం వాళ్ళకి

ఓ చిన్న బావిలా కనిపిస్తే

ఇక అంతకంటే ఏం చెప్పగలరు?

అంటుందామె, అతన్ని తనలో దాచుకుంటూ.



10

దేహం ఎముకలతో నిర్మితమైనట్లు

జీవితం అనుభవాలతో అంటున్నాడతను

కళ్ళకు ఫిలసాఫికల్ టచ్ ఇచ్చుకుంటూ


ఎముకలు లేని పెదాల రుచిని

ఆస్వాదిస్తూ అంటుందామె

ఎముకలు అనుభవాలు కావు

అనుభవాలు నిర్మితాలు కావు

దేహం జీవితమూ కాదు అని.

Friday, October 2, 2020

Curfew... Bharati Kode, Telugu Poet, Indian

 

Sometimes it happens like that…
There will be a ban on greetings and consolations.
A writ soon issues
That dreams should not cross the threshold of eyelids
And even a film of tear should not blur the eyeball.
It perplexes who the criminal is, and who gets sentence.
Spring visits innocently at its appointed hour
But the woods refuse to go abloom
Poor Clouds! They come together to quench the thirst
But people turn to statues that have no longing for it.
God knows which divine curse befell them!
The interdiction continues amidst doubts and ambiguity.
It confounds whether one would survive through
Or live as if every breath is his last.
Yet, heart pretends to beat as though everything was all right.
.
Bharati Kode



Born and brought up in Repalle, a small town on the river banks of Krishna in Guntur district of Andhra Pradesh, Ms. Bharati  works with GMR group  as  a development worker with focus on projects that positively affect children, youth and women.

 

She loves reading and talking about bookish things in real life. She writes and translates whenever her pressure of work permits.  She prefers writing poetry, her work-life experiences and book reviews.
In her own words,  she is "A firm believer in humanity and always find herself stuck between her desire to do endless things and her love to sleep!" 


ఒక్కోసారి అలాగే జరుగుతుంది
పలకరింపులు పరామర్శలు
నిషేధించబడతాయి
స్వప్నాలేవీ రెప్పలు దాటకూడదనీ
కన్నీళ్లు కంటనే పడకూడదనీ
ఆజ్ఞలు జారీ అవుతాయి
నేరమెవరిదో శిక్షెవరికో అర్ధం కాదు
ఏమీ తెలియని వసంతం
ఎప్పటిలాగే అమాయకంగా వచ్చేస్తుంది
చెట్లేమో పూయడానికి నిరాకరిస్తుంటాయి
దాహం తీర్చాలని మబ్బులన్నీ ఏరులవుతాయి
మనుషులేమో దప్పిక లేని శిలలుగా మారిపోతారు
ఏ గంధర్వుడు ఏ శాపమిచ్చాడో తెలియదు
సందేహాలు సందిగ్ధాల నడుమ
నిషేధాజ్ఞలు అమలవుతూనే ఉంటాయి
ఊపిరి అందుతుందో ఆగుతుందో తెలియని
ఆ నిర్బంధ సమయాలలో కూడా
గుండెలు కొట్టుకుంటున్నట్లు నటిస్తూనే ఉంటాయి
.
భారతి కోడె

 

The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...