Wednesday, August 12, 2020

మరణానంతర కులుకులు... టొఫీల్ గోట్యే, ఫ్రెంచి కవి

 




నేను చనిపోయిన తర్వాత, 

శవపేటిక కప్పు మూయకముందే,

నా బుగ్గలకు కాస్త ఎరుపునీ,

కంటికి కాటుకనీ అద్దండి. 


అతను ప్రమాణాలు చేసిన రాత్రి లానే

శాశ్వతంగా బుగ్గలపై గులాబి ఎరుపూ

నా నీలికళ్ళ రెప్పలక్రింద కాటుక నలుపుతో 

ఆ శవపేటికలో ఉండాలని కోరుకుంటున్నాను.


నా శరీరాన్ని ఆ పాద మస్తకమూ

నార చీరలతో ముసుగువేసి కప్పొద్దు; 

బదులు, ఆ తెల్లవస్త్రాన్ని అంచులంట సంప్రదాయంగా

పదమూడు మడతలు వేసి అందంగా కుట్టండి.


ప్రతి ముఖ్యమైన చోటుకీ అలాగే వెళ్ళేదాన్ని:

అతని మనసు దోచుకున్నప్పుడు అదే వస్త్రాలంకరణ;

అతని తొలిచూపు దాన్ని పావనం చేసింది, అందుకే,

అతని కోసమే ఈ అలంకరణ కోరుకున్నది. 


నా  సమాధిమీద ఏ పూల అలంకరణలూ వద్దు,

తలగడలపై కన్నీటి అందమైన అల్లికలూ వద్దు;

నన్ను నా తలగడ అంచుమీద పడుకోబెట్టండి

నా జుత్తుని సముద్రంలా అన్నిదిక్కులా పరుస్తూ. 


ఈ తలగడ ఎన్నో మోహావేశపు రాత్రులను చూసింది

నిద్రతో బరువెక్కిన కనుబొమలు ఏకమవడమూ చూసింది,

ఆ తలగడా-పడవ తన నల్లని నీడలో

లెక్కలేనన్ని ముద్దులను లెక్కపెట్టి ఉంటుంది. 


నిద్రకీ, ప్రార్థనకీ రెంటికీ అనువుగా

దగ్గర చేసిన దంతాల వంటి తెల్లని చేతులలో

రోము నగరం వెళ్ళినప్పుడు పోపు అనుగ్రహించిన

స్ఫటికాలతో చేసిన తావళాన్ని ఉంచండి.  


అప్పుడు, అలాంటి పానుపుమీద పడుక్కుని 

మెలకువలేని నిద్రకు ఉపక్రమిస్తాను  

అతని పెదాలు నా పెదాలపై పలికాయి ప్రార్థనలు 

నా ఆత్మశాంతికి భగవంతుణ్ణీ, మేరీనీ స్తుతిస్తూ.  

.

టొఫీల్  గోట్యే 

(30 August 1811 – 23 October 1872)

ఫ్రెంచి కవి, నవలాకారుడు, నాటక కర్త, కళా-, సాహిత్య విమర్శకుడు




Posthumous Coquetry

.

Let there be laid, when I am dead,

Ere ‘neath the coffin-lid I lie,

Upon my cheek a little red,

A little black abut the eye.

 

For I in my close bier would fain,

As on the night his vows were made,

Rose-red eternally remain,

With khol beneath my blue eye laid

 

Wind me no shroud of linen down

My body to my feet, but fold

The white folds of mu muslin gown

With thirteen flounces as of old.

 

This shall go with me where I go:

I wore it when I won his heart;

His first look hallowed it, and so,

For him, I laid the gown part.

 

No immortelles, no broidered grace

Of tears upon my cushions be;

Lay me on my pillow's lace

my hair across it like a sea.

 

That pillow, those mad nights of old,

Has seen our slumbering brows unite,

And neath the gondola’s black fold

Has counted kisses infinite.

 

Between my hands of ivory,

Together set with prayer and rest,

Place then the opal rosary

The holy Pope at Rome has blest.

 

I will lie down then that bed

And sleep the sleep that shall not cease;

His mouth upon mouth has said

Pater and Ave for my peace.

.

Théophile Gautier

(30 August 1811 – 23 October 1872)

French Poet, Dramatist, Novelist, art- and literary-critic

(Tr: Arthur Symons)

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/757/mode/1up



No comments:

Post a Comment

The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...