Hunger
Is much a like loan taken on compound interest;
The principal never gets cleared,
You perpetually pay the interest … in installments.
Forget just one EMI,
It will hit you on your tummy
Like the brute loan-collector.
With mushrooming hotels, restaurants,
And pizzas, burgers, and biryanis sold therein
A stomach un-famished
Can hardly relish a stale Roti like me.
For, I don’t bear that tang of tastelessness
Borne out of loss of appetite after an eating bout
To the point of throwing the food away.
After all, I am ---
A very ordinary Roti
That means
A Roti
Covetously preserved by the coolies
To beat the fire in the belly
Of morrow… in installments
That’s why I look dry.
I, too, was soft and yummy
Ready to melt on the tongue
When I was first prepared.
Children wanted to take me in one go.
But the elders warned them of
Morrow’s hunger,
And they preserved me.
Children pleaded
Cried their belly was not even half-full.
They repeatedly complained of hunger.
The elders persisted that
They should get used to starving.
Poor kids!
Looking at me eagerly, yet consciously
Suppressed their hunger against their will,
And set me aside for tomorrow.
I changed hands
And deeply studied varied lines
hunger had drawn on every hand there…
One farmer raised a wheat crop for me
But committed suicide unable to beat the hunger.
At another place, a farm laborer, for want of work
Migrated to town to feed the hungry mouths of his children
I rode on the backs of coolies
Who bore the wheat bags
I greeted the hunger in their bellies
And the worker in the flourmill
Traded his living
For few handfuls of flour
And ignoring the hunger within
A mother’s hand had prepared me.
Scared of hunger, they saw me as insurance
And as they preserved, I became stale.
They did not even mind that
And wanted to take me after soaking in water.
But now, forget about their hungry stomachs
There was no trace of their bones.
As I lie between the sleepers, now
No hungry mouth looks longingly at me.
And praying for some hungry mouth to reach me
I gave up the last traces of my life.
Yes,
I am a dry, stale, lifeless Roti.
.
Wahed
Telugu , Indian Poet
రొట్టె చచ్చిపోయింది
.
ఆకలి - చక్రవడ్డీల అప్పులాంటిది
అసలు తీరడం ఉండదు
వాయిదాలుగా వడ్డీ చెల్లించాలి
ఒక్క వాయిదా మరిచిపోయినా
గుండా లాంటి లోన్ కలెక్టర్ లా
కడుపులో పిడిగుద్దులు గుద్దుతుంది.
హోటళ్ళు, రెస్టరెంట్లు
పిజ్జాలు, బర్గర్లు, బిరియానీలు
ఆకలెరుగని నోటికి ఎండు రొట్టె తెలియదు
ఎందుకంటే –
తిని తిని, తినలేక పారేసే అరుచి
ఎండు రొట్టెలో ఉండదు.
నేను
ఒక మామూలు ఎండురొట్టెను
అంటే
ఒకటి రెండు రోజులు
ఆకలికి వడ్డీ కిస్తులు కట్టడానికి
కూలీలు దాచుకున్న రొట్టెను
అందుకే ఎండిపోయాను
వండినప్పుడు
నేను కూడా మెత్తగా, చాలా రుచిగా
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాను
పిల్లలు అప్పుడే నన్ను తినేద్దామన్నారు
పెద్దవాళ్ళు రేపు ఆకలి వేస్తే చస్తామన్నారు
అందుకే నన్ను దాచుకున్నారు
పిల్లలు ఏడ్చారు
సగం పొట్ట కూడా నిండలేదన్నారు
కడుపు మాడుతుందన్నారు
కడుపు మాడ్చుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు పెద్దలు
పాపం పిల్లలు
నన్ను... నోరూరించే రొట్టెను ఆశగా చూస్తూ సర్దుబాటు చేసుకున్నారు.
నన్ను రేపటి కోసం దాచుకున్నారు
నేను చాలా చేతులు మారాను
ప్రతి చేతిలోను ఆకలి వేసిన పిచ్చిగీతలు చూశాను.
పొలంలో నాకోసం గోధుమలు పండించాడు రైతు
ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
అక్కడ వ్యవసాయకూలీ
పనుల్లేక పిల్లల ఆకలి తీర్చడానికి పట్నం వచ్చాడు.
బస్తాల్లో నన్ను నింపి మోసిన కూలీల
వీపులపై స్వారీ చేశాను
వారి పొట్టలో ఆకలికి హలో చెప్పాను
మిల్లులో నన్ను పిండి కొట్టిన కూలీ
ఇంట్లో పిడికెడు పిండి కోసం
తన రోజులు అమ్ముకుంటున్నాడు
ఆకలిని కడుపులో దాచుకుని
నన్ను వండాయి గాజుల చేతులు
కడుపులో ఆకలి పిడిగుద్దులను సహిస్తూ
పిల్లల నోట్లో ముద్ద పెట్టాయి
కడుపు మాడ్చుకుని రేపటి కోసం దాచాయి
పాపం వాళ్ళవెరు తినలేదు
ఆ రోజుకు అర్థాకలితో కడుపు మాడ్చుకున్నారు
వాళ్ళంతా రేపటి ఆకలికి భయపడ్డారు
నేను ఎండిపోయాను.
ఎండినా ఫర్వాలేదు నీళ్ళలో నాన్చి తిందామనుకున్నారు
ఇప్పుడు ఆ ఎండిన డొక్కలు
ఎముకలుగా కూడా మిగల్లేదు
ఇప్పుడు పట్టాల మధ్య
నన్ను తినేవారు కూడా లేరు
శవాల మధ్య... ఒక శవంలా
నన్ను తినండ్రా అని మరింత ఎండిపోతూ
ప్రాణం వదిలాను
నేను
ఒక మరణించిన రొట్టెను
.
Wahed Abd
No comments:
Post a Comment