Monday, August 17, 2020

కాకీ- నక్కా... జీన్ డి ల ఫోంటేన్, ఫ్రెంచి కవి




ఒక ఓక్ చెట్టుకొమ్మ మీద కాకి వాలింది.

ముక్కున జున్నుముక్క కరుచుకుని ఉంది.

దాని ఘుమఘుమ వాసన ఎక్కడనుండి పసిగట్టిందో

ఒక నక్క అక్కడకి వచ్చి, తేనెపూసిన మాటలతో ఇలా అంది: 

"ఓ కాకి యువరాజా! నీవంటి సొగసుకాడిని 

ఈ పట్టున నే నింతవరకు చూసి ఉండలేదు.   

నీ గాత్రం ఇందులో సగం బాగున్నా 

ఈ అడవికి హంసవని అందరూ నిన్ను కొనియాడతారు సుమా!"  

ఆ మాటలు విని ఆనందంతో తబ్బిబ్బైన కాకి,  

తన గొంతు ఎలాగైనా నక్కకి వినిపించాలని 

నోరు తెరిచిందో లేదో, నోట్లోని జున్నుముక్క రాలిపోయింది. 

రెప్పపాటులో నక్క ఆ జున్నుముక్కని గాలిలోనే అందుకుంది.

"ప్రభూ! ఏలినవారు ఆలకించాలి," అని ప్రారంభించింది నక్క, 

"తమ పొగడ్తలు విన్నవాళ్ళమీదే భట్రాజులు బ్రతుకుతారు. 

ఇంత విలువైన సలహా పొందడానికి

ఈ జున్నుముక్క పెద్ద ఖర్చేమీ కాదు."  

 

అంత సులభంగా తను మోసపోయినందుకు కాకి సిగ్గుపడి 

ఆలస్యమైనా, మరోసారి మోసపోకూడదని ఒట్టు వేసుకుంది. 

.

జీన్ డి ల ఫోంటేన్

(8 July 1621 – 13 April 1695) 

ఫ్రెంచి కవి

అనువాదం: ఎడ్వర్ద్ మార్ష్)


Jean de la Fontaine
(8 July 1621 – 13 April 1695)

The Crow and the Fox

.

A crow perched upon an oak,

And in his beak he held a cheese.

A Fox snuffed up a savory breeze,

And thus in honeyed accent spoke:

“O Prince of Crows, such grace of mien

Has never in these parts been seen.

If your song be half as good,

You are the Phoenix of the wood!”

The Crow, beside himself with pleasure,

And eager to display his voice,

Opened his beak, and dropped his treasure.

The fox was on it a trice.

“Learn, sir,” said he, “that flatterers live

On those who swallow what they say.

A cheese is not too much to give

For such a piece of sound advice.”

The Crow, ashamed to have been such easy prey

Swore, but too late, he shouldn’t catch him twice.

.

Jean de la Fontaine

(8 July 1621 – 13 April 1695)

French Poet

(Tr: Edward Marsh)

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/731/mode/1up

No comments:

Post a Comment

The Vagabond... Iqbal Chand, Telugu Poet, Indian

This is such a droughty land like the highseas where you don't get even a drop of water to drink. But, dear friend!...